వార్షికోత్సవానికి పెద్దమ్మ Temple ముస్తాబు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 (ఇయ్యాల తెలంగాణ) :పెద్దమ్మ తల్లి 30వ వార్షికోత్సవ వేడుకలకు అమ్మవారి ఆలయం ముస్తాబవుతున్నది. మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజు అమ్మవారి రథోత్సవ వేడుకలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. అమ్మవారి విగ్రహం అదే రోజున ప్రతిష్ఠాపన జరిగింది. దీంతో ప్రతిఏటా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై వీధుల్లో ఊరేగిస్తారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడతారు. బుధవారం ఉదయం 3 గంటలకు పెద్దమ్మ తల్లికి అభిషేకం నిర్వహిస్తారు. గురువారం మండల పూజలు, వేదపారాయణం, శుక్రవారం రథోత్సవం, శనివారం అమ్మవారి ఉత్సవ మూర్తికి పుష్కరిణిలో స్నానంతో వార్షికోత్సవాలు ముగుస్తాయి. హంపీ పీఠాధిపతులు విద్యారణ్యస్వామి చేతుల విూదుగా విమాన శిఖర కుంభాభిషేకం నిర్వహిస్తారు. కొంగు బంగారమై భక్తులకు వరాలిచ్చే తల్లిగా పేరుపొందిన పెద్దమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడతారు. ఆలయం పేరువినగానే ముందుగా గుర్తుకొచ్చేది కాంగ్రెస్‌ మాజీ సీఎల్పీ లీడర్‌ దివంగత పీజేఆర్‌. చిన్నగా ఉన్న పెద్దమ్మ ఆలయాన్ని విస్తరించి అభివృద్ధి చేశారు. ఇప్పుడు నిత్యం వేలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మంగళవారం, శుక్రవారం, ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....