వన్‌ నేషన్‌..వన్‌ రేషన్‌ కార్డు విధానం ఆగస్ట్‌ నాటికి అములు లోకి తెస్తాం

రైతులకు మే 31వ తేదీ 2021 వరకు వడ్డీ రాయితీ పొడగింపు


23 రాష్టాల్లోన్రి 67 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం

కిసాన్‌ క్రెడిట్‌ కార్డుదారులకు 25వే కోట్ల రుణాలు

మత్స్యకారులకూ కిసాన్‌ క్రెడిట్‌ కార్డు

వలస కార్మికులకు ముప్పూటలా భోజనం

గ్రావిూణ ఆర్తిక వ్యవస్థ బలోపేతానికి చర్యలు



పేద అద్దెగృహాల  నిర్మాణానికి చర్యలు
 రెండోరోజూ వివరాలు  వెల్లడించిన  నిర్మలా సీతారామన్‌
న్యూఢిల్లీ ,మే14(ఇయ్యాల తెలంగాణ ):  సన్నకారు రైతులు , స్వయం ఉపాధి పొందుతున్న వారికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో కలసి ఆమె  విూడియా సమావేశంలో రెండో ప్రాధాన్యత రంగాలైన 9 విభాగాకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ వివరాలు  వెల్లడించారు. . ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ రెండో ప్యాకేజీ ప్రకటన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… వలస కూలీలు , వీధి వ్యాపారులు , చిన్న వ్యాపారుల  పై దృష్టి పెట్టామన్నారు. గ్రావిూణ ఆర్థికం, వలస కూలీల  సమస్యలు , రైతుల  సమస్యలపై దృష్టి సారించామన్నారు. ప్రధానంగా వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డ్‌  విధానాన్ని అమలు  చేయనున్నట్లు ప్రకటించారు. ఆగస్టు నాటికి దేశ వ్యాప్తంగా దీనిని అమలు  చేయనున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇక నుంచి రేషన్‌ కార్డు ఉన్న వ్యక్తులు  దేశంలో ఏ ప్రాంతంలోనైనా రేషన్‌ తీసుకోవచ్చు. ఈ విధానాన్ని పోª`ట్గంªబులిటీ అంటారు. అంటే తెలంగాణకు చెందిన వ్యక్తి ఢిల్లీలో  నివాసం ఉంటున్నట్లయితే.. ఢిల్లీ  లోనే రేషన్‌ సరుకులు  తీసుకోవచ్చు. ప్రస్తుతం రెండు తెలుగు  రాష్ట్రాల్లో ఈ విధానం అమలులో ఉంది. ఇది ఇకపై దేశ వ్యాప్తంగా అమలు  కానుంది. ఈ నూతన విధానం వల్ల 23 రాష్టాల్లోని  67 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం కలగనున్నట్లు సీతారామన్‌ పేర్కొన్నారు. ప్రజా పంపిణీ  వ్యవస్థలో భాగమైన 83 శాతం మందికి ఇది ప్రత్యక్షంగా ఉపయోగ పడుతుందని అన్నారు. అలాగే సన్నకారు రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు  అందిస్తున్నామన్నారు.
కిసాన్‌ కార్డు దారులకు 25వే కోట్ల రుణాలు  
అలాగే  25 లక్షల  మంది కిసాన్‌ కార్డుదారులకు రూ.25 వేల  కోట్ల రుణాలు  అందించామని, మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్‌ 30వ తేదీ వరకు మూడు కోట్ల మంది రైతులకు రూ.86,600 కోట్లు చౌకగా రుణాలు  ఇచ్చామని వెల్లడించారు.  సకాంలో రుణాలు  చెల్లించే రైతులకు మే 31వ తేదీ 2021 వరకు వడ్డీ రాయితీ పొడగింపును ప్రకటించారు.  వ్యవసాయ రుణాలపై మూడు నెలల  వరకు మారిటోరియం. గిరిజనులకు ఉపాధి అవకాశాలపై, ముద్ర యోజన, హౌసింగ్‌, ఉద్యోగాల  కల్పన అంశాల పై ప్యాకేజీ ప్రకటించారు.  గ్రావిూణ మౌళిక రంగానికి రూ. 4200 కోట్లు కేటాయించామని అన్నారు.  పట్టణ పేదలు , వలస కూలీలకు అన్నపానీయాల  కోసం ఏర్పాట్లు చేశాం. సహాయ శిబిరాలు , భోజన ఏర్పాట్లుకు రూ.11 వే కోట్లు కేటాయించాం. వలస కార్మికులకు నగదు పంపిణీ జరిగింది. వారికి రోజుకు మూడు పూటలు  అన్నపానీయాలకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.  గ్రావిూణ బ్యాంకు, సహాకార బ్యాంకుకు మార్చిలో రూ. 29500 కోట్లు ప్రభుత్వం రీఫైనాన్స్‌ చేసిందని తెలిపారు. పట్టణ స్వయం సహాయక సంఘాలకు రూ.12
వేల  కోట్లు ఇప్పటికే అందించాం. పైసా పోర్టల్‌ ద్వారా స్వయం సహాయక సంఘాలకు రివాల్వింగ్‌ ఫండ్‌ అందించాం. వలస కూలీలకు ఉపాధి కోసం మే 13 నాటికి రూ.13 కోట్ల పనిదినాలు  కల్పించాం. వ్యవసాయ ఉత్పత్తుల  కొనుగోలు  కోసం రాష్ట్రాలకు వర్కింగ్‌ క్యాపిటల్‌ కింద రూ. 6700 కోట్లు అందిస్తున్నాం. ఉపాధి హావిూ పథకం కింద రూ.10 వేల  కోట్లు ఇప్పటికే బట్వాడా జరిగింది. వలస కార్మికులు  ఉన్నచోటే కొత్తగా రిజిస్టేష్రన్‌ చేసుకుని ఉపాధి పొంద వచ్చన్నారు.  కనీస వేతనం 30శాతం మందికే అందుతోంది. దీన్ని సార్వజనీనం చేయాలని నిర్ణయించామన్నారు.  దేశమంతా ఒకే విధంగా కనీస వేతనం ఉండేలా చూస్తాం. వలస కార్మికుందరికీ ఆరోగ్య పరీక్షలు  చేయాలని నిర్ణయించామని అన్నారు.  వలస కార్మికులందరినీ ఏజెన్సీ ద్వారా కాకుండా నేరుగా తీసుకునేలా వెసులు  బాటు కల్పించాం. సంస్థలు , కంపెనీలన్నీ నేరుగా కార్మికులను నియమించుకునే అవకాశం ఉంటుంది. 10 మందికి పైగా ఉపాధి కల్పించే సంస్థన్నీంటికీ ఈఎస్‌ఐ సౌకర్యం ఉంటుంది. ఉపాధి కోసం సుదూర ప్రాంతాకు వెళ్తున్న కార్మికులకు నైపుణ్యం పెంచేలా ప్రత్యేక కార్యక్రమం తీసుకుంటున్నామని వెల్లడించారు.  ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కింద రాష్ట్రాలకు రూ.11,0002 కోట్లు ఇప్పటికే అందించాం.  12 వేల  స్వయం సహాయక సంఘాలకు 3 కోట్ల మాస్క్‌లు , లక్షా 20 వేల  లీటర్ల సానిటైజేషన్‌ తయారు చేశాయి.
రేషన్‌ కార్డుదారులకు ఉచితంగా సరుకులు
రేషన్‌ కార్డుదారులందరికీ ఉచితంగా ఆహార ధాన్యాల  పంపిణీ చేశాం. ఒక్కో వ్యక్తికి 5 కిలో చొప్పన బియ్యం,గోధుము  పప్పు పంపిణీ చేస్తున్నాం. రేషన్‌ కార్డు లేనివారు కూడా బియ్యం, గోధుము, పప్పు, తీసుకోవచ్చు. వలస కార్మికులు  ఎక్కుడన్నా, కార్డు లేకున్నా ఉచితంగా ఆహార ధాన్యాలు  పొందవచ్చన్నారు. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. రేషన్‌ కార్డు పోర్టబులిటీ తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పటికే ప్రారంభించాం. రేషన్‌ కార్డు ఉన్న వారు దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకోవచ్చు. ఆగస్టు నాటికి ఒకే దేశం… ఒకే కార్డు అమలులోకి తీసుకొస్తామని చెప్పారు.  ప్రస్తుతం 63 కోట్ల మందికి ఈ కార్డు వెసులుబాటు వస్తుంది. 2021 మార్చి 31 నాటికి వందశాతం రేషన్‌ కార్డులు  పోర్టబులిటీ చేస్తాం. ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు విధానం ప్రజా పంపిణీలో కొత్త విప్లవం తీసుకొస్తుందన్నారు.  వలస కార్మికులు , పట్టణ పేదల  కోసం స్వల్ప అద్దె గృహాల నిర్మాణానికి కొత్త పథకం తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.  
పేదల  కోసం గృహాల  నిర్మాణం
పట్టణ పేదలు , వలస కూలీలకు అందుబాటులో ఉండేలా పీపీపీ పద్ధతిలో గృహా నిర్మాణం చేపడతాం. రాష్ట్ర ప్రభుత్వాలు   ఈ పథకాన్ని చేపడితే తగిన సాయన్ని కేంద్రం అందిస్తుంది. వలస కార్మికు నివాసానికి ఇబ్బంది లేకుండా నూతన పథకం ఉంటుంది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద ఈ పథకాన్ని తీసుకొస్తాం. భూమి ఉన్నవాళ్లు ముందుకొస్తే తగిన సాయం కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముద్ర పథకం కింద రూ.50 వేల  లోపు శిశు రుణాలు  తీసుకున్న వారికి వడ్డీ రాయితీ. మారిటోరియం అనంతరం ముద్ర రుణాలపై 2 శాతం వడ్డీ రాయితీ అందిస్తామని సీతారామన్‌ తెలిపారు.
ఎలాట్‌ ఫాం వర్కర్లకు సాంఘిక భద్రత పథకం. వలస కార్మికులు, పట్టణ పేదలకు పిఎం ఆవాస్‌ యోజన కింద తక్కువ కిరాయికే ఇళ్లు. ముద్రాశిశు రుణాలు  తీసుకున్న వారికి 12 నెల పాటు 2 శాతం రడ్డీ రాయితీ. ముద్రా శిశు రుణాలు  తీసుకున్న 3కోట్ల మందికి లబ్ది. ఫుట్‌ పాత్‌ పై వ్యాపారాలు  చేసుకునేవారికి రూ. 5వేల  కోట్లతో రుణాలు . దీంతో మొత్తం 50 లక్షల  మంది వీధి వ్యాపారులకు లబ్ది. డిజిటల్‌ పేమెంట్‌ చేసేవారికి
మరిన్ని రాయితీలు . క్రెడిట్‌ లింక్‌ సబ్సిడీ స్కీం 2021 మార్చి వరకు పొడగింపు. కాంపా నిధుల  ద్వారా ఆదివాసీ యువతకు ఉద్యోగ కల్పన. రూ.6వేల  కోట్ల కాంపా నిధుల  ద్వారా ఆదివాసీ యువతకు ఉద్యోగ కల్పన. వచ్చే నెలలో క్యాంపా పథకం ప్రారంభం. రైతు కోసం నాబార్డుకు రూ.30వేల  కోట్ల అదనపు అత్యవసర నిధు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....