లోన్‌ యాప్‌ లు డౌన్‌ లోడ్‌ చేసి జీవితాలు విూదకు తెచ్చుకోకండి

రాపూరు, సెప్టెంబర్ 28 (ఇయ్యాల తెలంగాణ) :  లోన్‌ యాప్‌ లు ఫోన్‌ కు వచ్చే లింక్‌ లతో ఏ ఒక్కరు నష్ట పోవద్దని రాపూరు సి ఐ నాగమలేశ్వర రావు అన్నారు.సైదాపురం సి ఆర్‌ ఆర్‌ కాలేజ్‌ లో విద్యార్థుల తో ఇంటర్నెట్‌ లో పర్సనల్‌ ఫోటో లను షేర్‌ చేయవద్దని అలాగే లోన్‌ యాప్‌ డౌన్‌ లోడ్‌ చేయటం కానీ లింక్‌ లు ఓపెన్‌ చేసి సైబర్‌ దొంగల బారిన పడి డబ్బులు పోగొట్టుకోవద్దని అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన ఈ సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి దేశానికి కన్న తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చే విదంగా సొంత కాళ్ళ విూద నిలబడేలా శ్రద్ధ తో విజయంసాధించాలనిసూచించారు.తెలిసో తెలియకో కొంత మంది విద్యార్థులు జీవితాలను బలి చేసుకుని నిందితులు అవుతున్నారని అసాంఘిక కార్యకలాపాల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడవద్దని సూచించారు. యాప్‌ డౌన్‌ లోడ్‌ చేసుకుని డబ్బులు తీసుకుంటే విూ డేటా మొత్తం లోన్‌ యాప్‌ లకు చేరుతుందని లోన్‌ తీసుకున్న దానికంటే 10 రెట్లు భయపెట్టి లోన్‌ యాప్‌ నిర్వాహకులు దోపిడీ చేసేదే ఎక్కువని ఆన్‌ లైన్‌ లోన్‌ యాప్‌ లో డబ్బులకు ఎర కావద్దనిసూచిస్తున్నామన్నారు.ఎవ్వరైనా అలాంటి ఇబ్బందులు ఎదురైతే ముందుగా పోలీస్‌ ల ను ఆశ్రయించి కేసు పెట్టాలని సూచిస్తున్నా మని భయపడి ప్రాణాలను బలి చేసుకోవద్దని కోరుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ ఐ ఎం ఉమాశంకర్‌, ఆకళాశాల ప్రిన్సిపాల్‌ లు,లెక్చరర్‌ లు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....