లోక్‌సభ JULY 1కి వాయిదా

 న్యూఢల్లీ జూన్‌ 28 (ఇయ్యాల తెలంగాణ );  నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌ టిఏ) నిర్వహించిన ‘నీట్‌’ పరీక్షలో జరిగిన అవకతవకలపై ప్రతిపక్ష కూటమి అయిన ఇండియా బ్లాక్‌ లోక్‌ సభ, రాజ్యసభలోనూ శుక్రవారం పట్టుబట్టాక సభలో గలాభ మొదలయింది. దాంతో రెండు సభలను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ సమావేశ మొదలయినప్పటికీ వేడి చల్లారకపోయే సరికి లోక్‌ సభ ప్రొసీడిరగ్స్‌ ను జులై1 (సోమవారం)కి వాయిదా వేశారు.బిజెపి నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ లోక్‌ సభలో నేడు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రధాని మోడీ జులై 2న సమాధానాలు ఇవ్వనున్నారు. బిజెపి ఎంపీ బన్సురీ స్వరాజ్‌ రెండో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....