లద్దాఖ్‌లో చైనా ఏం చేస్తోంది? – మరోమారు రాహుల్‌ అనుమానాలు ?

రాజ్‌నాథ్‌ తన ట్వీట్‌తో కాంగ్రెస్‌ పార్టీని అటాక్‌ చేశారు.

న్యూఢిల్లీ,జూన్‌9(ఇయ్యాల తెలంగాణ):  కొన్నాళ్ల నుంచి సరిహద్దు విషయంలో చైనాతో పేచీ జరుగుతున్న క్రమంలో ఆదివారం రాహుల్‌ చేసిన ట్వీట్‌ కొత్త వాగ్వాదానికి దారి తీసింది. లడాఖ్‌లో ఏం జరుగుతుందో ప్రతి భారతీయ సైనికుడికి తెలుసు అని, వారి రక్తం మరుగుతోందని, కానీ విూడియా నోరును కూడా నొక్కేశారని రాహుల్‌ వివాదాస్పద ట్వీట్‌ చేశారు. దానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కౌంటర్‌గా ఓ ట్వీట్‌ చేశారు. ఓ కవితను ట్వీట్‌ చేస్తూ రాహుల్‌కు రాజ్‌నాథ్‌ సమాధానం ఇచ్చారు. అయితే తాజాగా ఆ ట్వీట్‌ను ప్రశ్నిస్తూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ మరో అనుమానాన్ని లేవనెత్తారు. రక్షణ మంత్రి ట్వీట్‌తో ఓ విషయం బయట పడిందని,  దానికి ఆయన సమాధానం ఇవ్వగరా అని రాహుల్‌ అడిగారు. లడాఖ్‌లో ఉన్న భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందా? అని రాహుల్‌ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.సోమవారం ఓ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కొన్ని కీలక వ్యాఖ్యలు  చేశారు.  భారత రక్షణ వ్యవస్థకు ప్రపంచదేశాల  గుర్తింపు ఉన్నదని, తమ సరిహద్దుల్ని రక్షించుకోవడంలో అమెరికా, ఇజ్రాయిల్‌ తర్వాత స్థానం భారత్‌దే అని షా అన్నారు. ఆ వ్యాఖ్యలను తప్పుపడుతూ రాహుల్‌ తొలుత విమర్శలు  చేశారు. దానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ఓ కౌంటర్‌ ఇచ్చారు. చేతికి నొప్పి ఉంటే మందు రాయాలని, కానీ చేయి సరిగా లేకుంటే, అప్పుడు ఏం చేస్తామని రాజ్‌నాథ్‌ తన ట్వీట్‌తో కాంగ్రెస్‌ పార్టీని అటాక్‌ చేశారు.
iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....