రైతు సంక్షేమానికి సంబంధించిన ప్రతి డిమాండ్‌ను నెరవేర్చేందుకు సిద్దం : Modi

 రైతు సంక్షేమానికి సంబంధించిన ప్రతి డిమాండ్‌ను నెరవేర్చేందుకు సిద్దం

 స్పష్టం చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

 న్యూ డిల్లీ ఫిబ్రవరి 22 (ఇయ్యాల తెలంగాణ) : రైతు సంక్షేమానికి సంబంధించిన ప్రతి డిమాండ్‌ను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేంద్రం చెరకు పంటకు గిట్టుబాటు ధరను పెంచిన నేపథ్యంలో గురువారం ఆయన ఈ విధంగా స్పందించారు.దేశ వ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు సంబంధించిన ప్రతి తీర్మానాన్ని నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే చారిత్రాత్మక నిర్ణయం వెలువడిరదని చెప్పారు. చెరకు కొనుగోలు ధర పెంపుకు ఆమోదం లభించిందని తెలిపారు. ఈ చర్య వల్ల చెరకు ఉత్పత్తి చేసే కోట్లాది మంది రైతులకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంటూ మోదీ ట్వీట్‌ చేశారు. కాగా, తమ పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చేలా చట్టబద్ధత చేయడంతో పాటు.. రుణమాఫీ, పలు డిమాండ్లతో రైతులు చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో మోదీ ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....