రైతుల పట్ల నిర్ణయం అభినందనీయం

హైదరాబాద్,నవంబర్ 22 (ఇయ్యాల తెలంగాణ) :  భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల  రైతులకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం పట్ల ఇండియా కోహ్లీ సమాజ్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇండియా కోహ్లీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ ప్రకటన విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని కొనియాడారు. రైతులు దైవంతో సమానమని వారి వల్లనే మనకి భుక్తి, ముక్తి అన్ని ఉన్నాయన్నారు. మోడీ నిర్ణయం పట్ల మేమంతా ఎంతగానో అభినందిస్తున్నామని తెలిపారు. రైతులు చేసిన ధర్నాలు చరిత్రలో నిలిచిపోయే ధర్నాలని ఎందుకంటే రైతు చట్టాలను రద్దు చేయమని సంవత్సరం పాటు ధర్నా చేయడం ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు అని  రైతుల కోసం చట్టాలని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి తెలుగు రాష్ట్రాల రైతుల పట్ల ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేస్తున్నట్లు ఇండియా కోహ్లీ ఎగ్జిక్యూటివ్ మెంబర్  పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ తెలిపారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....