హైదరాబాద్,సెప్టెంబర్ 11 (ఇయ్యాల తెలంగాణ) : రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూశారు. సీనియర్ సినీ నటుడు కృష్ణం రాజు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ ఆదివారం తెల్లవారు ఝామున తుది శ్వాస విడిచారు. 83 సంవత్సరాల కృష్ణం రాజు పలు సినిమాల్లో నటించారు. కేంద్ర మంత్రిగా వాజ్ పేయ్ హయాంలో పనిచేశారు. దాదాపు 183 కి పైగా సినిమాల్లో నటించిన కృష్ణం రాజు అనారోగ్యం కారణంగా గత కొంత కాలంగా చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం కన్ను మూసారు. కృష్ణం రాజు మరణంతో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులూ, అభిమానులు తీవ్ర ద్రిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్ను మూత
Leave a Comment