రూ. 60 వేలకు చేరిన Gold

హైదరాబాద్‌,  సెప్టెంబర్‌ 1, (ఇయ్యాల తెలంగాణ) : బంగారం ధర వరుసగా రెండో రోజు పెరిగింది. గురువారం తులం బంగారంపై సుమారు రూ. 300 పెరగగా, శుక్రవారం కూడా బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. డాలర్‌ విలువ పుంజుకున్న తర్వాత కూడా బంగారం ధరల్లో పెరుగదల కనిపించడం గమనార్హం. ఇప్పటికే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60 వేలు దాటేసింది. ఇక రోజురోజుకీ బంగారం ధరలో పెరుగదల కనిపిస్తూనే ఉంది. తాజాగా శుక్రవారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధర పెరిగింది. 

👉 ఢిల్లీ లో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 55,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,310 గా ఉంది.

👉 ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ. 55,150 , 24 క్యారెట్స్‌ ధర రూ.       60,1603 వద్ద కొనసాగుతోంది.

👉 కోల్‌కతాలో 22 క్యారెట్స్‌ రూ. 55,150 , 24 క్యారెట్ల ధర రూ. 60,160 గా ఉంది.

👉 చెన్నైలో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,450 , 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,490 వద్ద కొనసాగుతోంది.

👉 బెంగళూరులో 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 55,150 గా ఉండగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,160 గా ఉంది.

👉 హైదరాబాద్‌లో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ రూ. 55,150 , 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 60,160 వద్ద కొనసాగుతోంది.

👉 వరంగల్‌లో 22 క్యారెట్స్‌ బంగారం ధరూ. 55,150 కాగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,160 గా ఉంది.

👉 విజయవాడలో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,150 , 24 క్యారెట్స్‌ ధర రూ. 60,160 వద్ద కొనసాగుతోంది.

👉విశాఖలో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,150 , 24 క్యారెట్స్‌ ధర రూ. 60160 గా ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తే వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరల్లో మార్పులు కనిపించలేదు. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఈరోజు కిలో వెండి ధర ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. ఢల్లీిలో కిలో వెండి ధర రూ.77,600 , చెన్నైలో కిలో వెండి ధర రూ. 80,700 , బెంగళూరులో కిలో వెండి ధర రూ. 76,500 గా ఉండగా తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 80,700గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలోనూ కిలో వెండి ధర రూ. 80,700వద్ద కొనసాగుతోంది

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....