రినైసెన్స్‌ పిక్చర్స్‌, వరుణ్‌ తేజ్‌

 జులై 4, (ఇయ్యాల తెలంగాణ ):  వరుణ్‌ తేజ్‌, సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌, రినైసెన్స్‌ పిక్చర్స్‌ తెలుగు`హిందీ యాక్షన్‌ డ్రామా చపు13 యాక్షన్‌ షెడ్యూల్‌ పూర్తి, డిసెంబర్‌లో థియేట్రికల్‌ రిలీజ్‌మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ చపు13 టీమ్‌ గత కొన్ని రోజులుగా అన్నపూర్ణ 7 ఎకర్స్‌ లో ఒక ఇంటెన్స్‌ యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న మూడో షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తయింది. ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మేకర్స్‌ రివిల్‌ చేసిన పోస్టర్‌లో వరుణ్‌ తేజ్‌ యుద్ధ విమానం ముందు నిలబడి ఉన్న ఎంఈ అధికారిగా కనిపించారు.ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌, రినైసెన్స్‌ పిక్చర్స్‌ కలిసి రూపొందిస్తున్న ఈ యాక్షన్‌ డ్రామా టైటిల్‌ను త్వరలో అనౌన్స్‌ చేస్తారు. భారీ అంచనాలున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.మాజీ మిస్‌ యూనివర్స్‌ మానుషి చిల్లార్‌ ఈ చిత్రంలో రాడార్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు.ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ 7 ఎకర్స్‌ లో శరవేగంతో జరుగుతోంది. ఒక మేజర్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ ని భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారు.  వరుణ్‌ తేజ్‌ డాషింగ్‌ గా కనిపిస్తున్న కొన్ని స్టిల్స్‌ ను మేకర్స్‌ విడుదల చేశారు.ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌, రినైసెన్స్‌ పిక్చర్స్‌ సందీప్‌ ముద్ద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. నందకుమార్‌ అబ్బినేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....