రాహుల్‌ గాంధీకి షర్మిల అభినందనలు

హైదరాబాద్‌ ఆగష్టు 8 (ఇయ్యాల తెలంగాణ ): పార్లమెంట్‌ సభ్యునిగా తిరిగి నియమించబడ్డ రాహుల్‌ గాంధీ కి వైయస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్‌ షర్మిల  అభినందనలు తెలియజేసారు.  న్యాయం, ధర్మం గెలిచాయనడానికి సుప్రీం కోర్టు తీర్పే ఒక ఉదాహరణ.  విూరు తిరిగి పార్లమెంట్‌ కి రావడం దేశానికి ఎంతో అవసరం. పార్లమెంట్‌ వేదికగా విూ గళం వినిపిస్తారని దేశం ఎదురుచూస్తుంది.  అహర్నిశలు ప్రజాస్వామ్య పరిరక్షణ, లౌకికవాద పరిరక్షణ, దేశ భద్రత, ఉన్నతి, ఐక్యతలపై విూ పోరాట పఠిమ ఎంతో ఆదర్శమని అన్నారు.  దేశ భద్రత, ఉన్నతి, ఐక్యత వీటిపై అందరు నాయకులు కలిసి పోరాడాలి.  పార్లమెంట్‌ లో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి బేషరతుగా నా నైతిక మద్దతు తెలియజేస్తున్నాని అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....