రాహుల్‌ కు హైకోర్టులో చుక్కెదురు

  

న్యూఢల్లీ, జూలై 9, (ఇయ్యాల తెలంగాణ ):  8 ఏళ్ల పోటీకి అనర్హత

మోదీ ఇంటిపేరుకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీకి గుజరాత్‌ హైకోర్టు నుంచి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. రాహుల్‌ గాంధీ పునర్విచారణ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ట్రయల్‌ కోర్టు తీర్పు సరైనదేనని, ఆ ఉత్తర్వుపై జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని, అందుకే దరఖాస్తును కొట్టివేస్తున్నట్లు గుజరాత్‌ హైకోర్టు పేర్కొంది.రాహుల్‌గాంధీకి గుజరాత్‌ హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. పరువు నష్టం కేసులో గుజరాత్‌ హైకోర్టు కీలక తీర్పు వెళ్లడిరచింది. మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యానించినందుకు దోషిగా తేలిన కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీకి శుక్రవారం చాలా ముఖ్యమైన రోజు. మోదీ ఇంటిపేరుకు సంబంధించిన పరువు నష్టం కేసులో విధించిన శిక్షపై రాహుల్‌ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై గుజరాత్‌ హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలందరూ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ అంశంపై గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హేమంత్‌ ప్రచాక్‌తో కూడిన సింగిల్‌ బెంచ్‌ తీర్పు వెలువరించారు. రాహుల్‌ గాంధీని సూరత్‌ కోర్టు దోషిగా నిర్ధారించి మార్చి 23న రెండేళ్ల జైలు శిక్ష విధించింది.రాహుల్‌ గాంధీపై కనీసం 10 క్రిమినల్‌ కేసులు పెండిరగ్‌లో ఉన్నాయని కోర్టు పేర్కొంది. హైకోర్టు ఈ నిర్ణయం తర్వాత, రాహుల్‌ గాంధీ ఇకపై 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేరు, అలాగే పార్లమెంటు సభ్యుని (ఎంపీ) హోదాపై సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోలేరు. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవచ్చు. రాహుల్‌ లోక్‌ సభ సభ్యత్వం ఇప్పటికే ముగిసింది. అంతకుముందు రాహుల్‌ గాంధీ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది మరియు వేసవి సెలవుల తర్వాత తుది ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది.
 2024 లోక్‌?సభ ఎన్నికలు సవిూపిస్తున్న వేళ.. రాహుల్‌? గాంధీపై గుజరాత్‌? హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్‌? కు కూడా షాక్‌? తగిలినట్టు అయ్యింది. ఏదైనా కేసులో దోషిగా తేలితే, సంబంధిత వ్యక్తి 8ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిబంధనల్లో ఉంది. అలాంటిది.. 2024 ఎన్నికల వేళ రాహుల్‌? గాంధీ పోటీ చేయకపోతే ఎలా? అని కాంగ్రెస్‌? శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. హైకోర్టు తీర్పుపై ఇప్పుడు రాహుల్‌ గాంధీకి ఒక్కటే ఆప్షన్‌  మిగిలింది. అదే సుప్రీంకోర్టుకు వెళ్లడం . సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసుకుని రెండేళ్ల జైశిక్షపై స్టే తెచ్చుకుంటే తప్ప.. ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు రాహుల్‌ గాంధీ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఏదైనా నేరానికి పాల్పడి, రెండు సంవత్సరాల కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష విధించబడిన వ్యక్తి ళిసబ్‌`సెక్షన్‌ (1) లేదా సబ్‌`సెక్షన్‌ (2)లో సూచించిన ఏదైనా నేరం కాకుండా  అటువంటి నేరారోపణ తేదీ నుండి అనర్హులు అవుతారు . అతను విడుదలైనప్పటి నుండి మరో ఆరు సంవత్సరాల పాటు అనర్హుడిగా కొనసాగాలి. ఈ నిబంధన ప్రకారం రాహుల్‌ గాంధీ అనర్హడవుతారు.సుప్రీంకోర్టులోనూ శిక్షపై స్టే లభించకపోతే ఆయన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని రకాల న్యాయస్థానాల్లో అవకాశాలు కోల్పోయిన తర్వాత ఆయన .. జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఇలా జైలుకు వెళ్తే.. పరువు నష్టం కేసులో జైలుకు వెళ్లిన ప్రధాని పదవికి పోటీ పడే నేతగా చరిత్రకెక్కుతారు. రెండేళ్ల పాటు జైల్లో ఉంది. విడుదలైన తర్వాత ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయాడనికి అనర్హులు అవుతారు. ఈ కారణంగా రాహుల్‌ గాంధీ సుప్రీంకోర్టులో వేయబోయే పిటిషన్‌పై ఆసక్తి ఏర్పడుతోంది. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....