రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో ప్రతిపక్ష ఇండియా కూటమి భేటి

 
న్యూఢల్లీ ఆగష్టు 2 (ఇయ్యాల తెలంగాణ ): ప్రతిపక్ష ఇండియా కూటమి (ఎ.ఔ.ఆ.ఎ.ం) ఎంపీలు బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో సమావేశమయ్యారు. మణిపూర్‌ సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. జూలై 29, 30 తేదీల్లో ఆ రాష్ట్రంలో పర్యటించిన ఎంపీలు, ఇండియా కూటమి ఫ్లోర్‌ లీడర్స్‌ ఈ బృందంలో ఉన్నారు.రాష్ట్రపతిని కలిసిన అనంతరం ఈ బృందం విూడియాతో మాట్లాడిరది.

 కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, తాము మణిపూర్‌ సమస్యను రాష్ట్రపతికి వివరించామని చెప్పారు. మణిపూర్‌లో మహిళలపై దురాగతాలు జరుగుతున్నాయని, పునరావాస కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేవని చెప్పామని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మణిపూర్‌లో పర్యటించి, శాంతిని పునరుద్ధరించేందుకు కృషి చేయాలనేదే తమ ప్రధాన డిమాండ్‌ అని చెప్పారు.మణిపూర్‌లో మే 3 నుంచి హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం వీరి కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ సమస్యపై ప్రధాని మోదీ పార్లమెంటులో మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. స్వల్ప కాలిక చర్చ జరిపేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ చర్చకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమాధానం చెబుతారని చెప్పింది. కానీ ప్రతిపక్షాలు మోదీయే మాట్లాడాలని పట్టుబడుతున్నాయి. ప్రతిపక్ష సభ్యుల నినాదాల హోరుతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తరచూ వాయిదా పడుతున్నాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....