రాష్ట్రంలో ప్రమాదకరంగా కరోనా పరిస్థితి

కేసులు  పెరుగుతున్నా పట్టింపులేని సర్కార్‌: బండి

]హైదరాబాద్‌,జూన్‌8(ఇయ్యాల తెలంగాణ): రాష్ట్రంలో పరిస్థితి ప్రమాదకరంగా  ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రధానంగా కరోనా విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని అన్నారు. డాక్టర్లకే దిక్కు లేకుండా పోయిందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. ఏం జరిగినా కేంద్రమే చెప్పిందంటున్నారన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు  భారీగా పెరుగుతున్న చికిత్స ట్రీట్మెంట్‌ చేస్తున్న డాక్టర్లకు వసతి కల్పించడం లేదన్నారు. ట్రీట్మెంట్‌ చేస్తున్న డాక్టర్లకు ఎన్‌`95 మాస్కులు  లేవన్నారు. కరోనా హెల్త్‌ బులిటెన్‌ కూడా సరిగా ఇవ్వడం లేదన్నారు. టెస్టులు  చేయకుండానే రాష్ట్రంలో కేసుల  సంఖ్య పెరిగిందన్నారు. టెస్టులు  పెరిగితే కేసులు  చాలా పెరుగుతున్నాయన్నారు. కరోనా వచ్చినా డ్యూటీ చేయాలని పీజీ డాక్టర్లను బెదిరిస్తున్నారన్నారు. పీజీ మెడికల్‌ స్టూడెంట్స్‌కు టెస్టులు  ఎందుకు చేయడం లేదన్నారు. గాంధీ, ఉస్మానియాలో స్టాఫ్‌ లేరన్న విషయాన్ని కూడా పెద్దగా  పట్టించుకోవడం లేదని బండి సంజయ్‌ అన్నారు. ఇంత దారుణంగా పరిస్తితులు  ఉన్నా,రోజురోజుకు కరోనా కేసులు  పెరుగుతున్నా సిఎం కెసిఆర్‌ పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు.
iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....

View Comments (1)

  • మళ్ళీ లాక్ డౌన్ అమలు చేసే పరిస్థితి ఉంది..తస్మాత్ జాగ్రత్త.