న్యూ డిల్లీ జూన్ 8 (ఇయ్యాల తెలంగాణ) : ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సంతాపం ప్రకటించారు. రామోజీరావు మృతితో దేశం ఓ విూడియా దిగ్గజాన్ని కోల్పోయిందన్నారు.‘రామోజీ మరణంతో విూడియా, వినోద రంగం ఓ టైటాన్ను కోల్పోయింది. రామోజీరావు ఓ వినూత్న వ్యాపారవేత్త. ఈనాడు వార్తా పత్రిక, ఈటీవీ న్యూస్ నెట్వర్క్, రామోజీ ఫిల్మ్ సిటీ సహా అనేక సంస్థలను స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. తన దూరదృష్టితో ఎన్నో విజయాలు సాధించి సమాజంలో చెరగని ముద్రవేశారు. విూడియా, సినీ పరిశ్రమలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. పద్మవిభూషణ్ అందుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి’ అని రాష్ట్రపతి ముర్ము తన ట్వీట్లో పేర్కొన్నారు

