రాజ్‌కుంద్రాకు టాటా చెప్పనున్న శిల్పాశెట్టి ?

హిందీనటి శిల్పా శెట్టి తన భర్త రాజ్‌కుంద్రాకు విడాకులు ఇచ్చేందుకు సిద్దమవుతున్నట్లు బాలీవుడ్‌ వర్గాల నుంచి సమచారం. రాజ్‌కుంద్రాతో విడిపోయి తన పిల్లలతో కలిసి జీవించాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్లు రెండు రోజులుగా బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. పోర్న్‌ వీడియో యాప్ట్‌ కేసులో రాజ్‌ కుంద్రా అరెస్ట్‌ అయి జైలుకి వెళ్లిన సంగతి తెలిసిందే! ఇటీవల ఆయన బెయిల్‌పై బయటికొచ్చారు. రాజ్‌కుంద్రా అరెస్ట్‌తో శిల్పా శెట్టి ఆమె కుటుంబం గడ్డు పరిస్థితులు చూస్తున్నది.  అవమానంతో కొద్ది రోజులుగా ఆమె బయటకు కూడా రావడం లేదు. ఇటీవల తిరిగి షూటింగ్‌లకు హాజరవుతున్న శిల్పాశెట్టి ’నేను తప్పు చేశానంటూ’ ఓ పోస్ట్‌ షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. ’తప్పులు మానవ సహజం. తప్పు చేయకుండా ఎవరూ ఉండదు. కానీ ఆ తప్పులు భయంకరంగా, ఇతరులకు బాధ కలిగించేలా ఉండకూడదు. తప్పు చేశాను కానీ వాటిని సరిదిద్దుకుంటాను’ అంటూ ఆమె పోస్ట్‌లో పేర్కొనడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రాతో విడిపోతుందంటూ అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అంతేకాదు రాజ్‌కుంద్రా అక్రమంగా సంపాదించిన డబ్బును ఆమె ముట్టుకోకూడదనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భర్త చేసిన ఎన్నో తప్పుల్ని క్షమించుకుంటూ వచ్చిన శిల్పా తన ఓర్పును కోల్పోయిందని సన్నిహితులు చెబుతున్నారు. అందుకే భర్తతో బంధానికి బై చెప్పి పిల్లలతో జీవితం సాగించాలని భావిస్తున్నారట. అయితే ఈ విషయంపై శిల్పాశెట్టి స్పందిస్తే తప్ప నిజాలు తెలియవు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....