రంజాన్ పండుగ పురస్కరించుకొని ఫీడ్ ది నీడ్

రంజాన్ పండుగ పురస్కరించుకొని ఫీడ్ ది నీడ్

రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సనత్ నగర్ కరోనా వారియర్స్ టీమ్

హైదరాబాద్ మే 25 (ఇయ్యాల తెలంగాణ )
సనత్ నగర్ కరానా వారియర్స్ టీమ్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని ఈ రోజు పేద ప్ర్జజలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఫీడి ది నీడి కార్యక్రమంలో భాగంగా గత లాక్ డౌన్ నుంచి సనత్ నగర్  కరోనా వారియర్స్ టీమ్ నిర్విరామ కృషితో పేద ప్రజలందరికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే లాక్ డౌన్ కు ప్రభుత్వం కొంత సడలింపు ఇవ్వడంతో కాస్తంత ఊపిరి పీల్చుకుందామనుకుంటున్న జనాలకు మల్లీ గ్రేటర్ పరిధిలో రోజు రోజు కు పెరుగుతున్న కేసులు ఆందోళనను కలిగిస్తున్నాయని  ఫీడ్ ది నీడి  సభ్యులు పేర్కొన్నారు.

 ప్రభుత్వ సూచనలు ప్రతి ఒక్కరు పాటిస్తూ ఎవరికి వారే తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరము ఉన్నదని కోరారు. సాంఘిక దూరం పాటిస్తేనే మనమంతా కరొనాతొ దూరంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులందరికి కమిటీ సభ్యులు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజపా పార్టీ నాయకులు యేచన్ సురేష్, పొలిమేర సంతోష్ కుమార్, టి ఆర్ ఎస్ పార్టీ ఖలీల్ తెలుగు దేశం పార్టీ వహీదుద్దీన్ పటేల్ తదితరులు పాల్గొని ఒకరికొకరు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే  రంజాన్  శుభాకాంక్షలు తెలుపుకొని పేద ప్రజలకు పండుగ సందర్బంగా ఆహార పొట్లాలు అందించారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....