రంగబలి సక్సెస్‌ విూట్‌ లో హీరో నాగశౌర్య

  
జులై 9, (ఇయ్యాల తెలంగాణ ):యంగ్‌ అండ్‌ డైనమిక్‌ హీరో నాగశౌర్య, కొత్త దర్శకుడు పవన్‌ బాసంశెట్టి దర్శకత్వం వహించిన కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ ‘రంగబలి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎస్‌ ఎల్‌ వి సినిమాస్‌ పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన  ఈ చిత్రంలో యుక్తి తరేజ కథానాయికగా నటించారు. జూలై 7న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ‘భలే’ ఎంటర్‌ టైనర్‌ గా నిలిచి బ్లాక్‌ బ్లాక్‌ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సక్సెస్‌ విూట్‌ నిర్వహించింది.సక్సెస్‌ విూట్‌ లో హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. రంగబలి చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. పవన్‌ చాలా మంచి సినిమా తీశారు. చాలా మంచి కథ చెప్పారు. ప్రేక్షకులు చాలా ఎంజాయ్‌ చేస్తున్నారు. ‘ఛలో’ తర్వాత నాకు రంగబలి మరో బ్లాక్‌ బస్టర్‌. ఈ ప్రయాణంలో సపోర్ట్‌ చేసిన నిర్మాత సుధాకర్‌ గారికి. టీం అందరికీ కృతజ్ఞతలు. యుక్తి చక్కగా నటించింది. చాలా మందికి నచ్చింది. సత్య, జాకెట్‌ (రాజ్‌ కుమార్‌ ) ఇద్దరూ చక్కగా ఎంటర్‌ టైన్‌ చేశారు. ఈ విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు’’ తెలిపారుదర్శకుడు పవన్‌ బాసంశెట్టి మాట్లాడుతూ..రంగబలి చిత్రాన్ని ప్రేక్షకులు అన్ని చోట్ల ఎంతగానో ఎంజాయ్‌ చేస్తున్నారు. సినిమా చూస్తున్నంత సేపు పడిపడి నవ్వుతున్నారు. ఫస్ట్‌ హాఫ్‌ ని చాలా ఎంజాయ్‌ చేస్తున్నారు. శౌర్య అన్న, సత్య, రాజ్‌ కుమార్‌ పాత్రలు ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తున్నాయి. సెకండ్‌ హాఫ్‌ లో ఒక మంచి కథ, సందేశాన్ని చెప్పాం. యూత్‌ ఫ్యామిలీ ఆడియన్స్‌ చాలా ఎంజాయ్‌ చేస్తున్నారు. కలెక్షన్స్‌ బాగున్నాయి. నాగశౌర్య అన్నకి, నిర్మాత సుధాకర్‌ గారికి కృతజ్ఞతలు. ఈ విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ తెలిపారు.యుక్తి తరేజ మాట్లాడుతూ..ఇది నా మొదటి తెలుగు సినిమా. సినిమాని ప్రేక్షకులు   ఎంతగానో ఆదరిస్తున్నారు. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. సినిమాని ప్రేక్షకులు ఎంజాయ్‌ చేయడం చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. విూ అందరి సపోర్ట్‌ కావాలి’’అన్నారురాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. రంగబలి అందరికీ నచ్చింది. సినిమాని అందరూ ఎంజాయ్‌ చేస్తున్నారు. చూడనివారు ఉంటే ఖచ్చితంగా చూడండి ఇది ఒక ఊరు ఎమోషన్‌. అందరికీ కనెక్ట్‌ అవుతుంది’’ అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....