యూనివర్సిటీలతో గవర్నర్‌ నేరుగా చర్చలు

విద్యాసంబధ అంశాల పై ఆరా

కాకతీయ వర్శిటీ అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడుతున్న తెలంగాణ గవర్నర్

హైదరాబాద్‌,మే29(ఇయ్యాల తెలంగాణ): యూనివర్శిటీ పనితీరుపై గవర్నర్‌ ఆరా తీస్తున్నారు. స్వయంగా వీడియో కాన్ఫ్రెన్స్‌ ద్వారా చర్చిస్తున్నారు.  రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీ టీచింగ్‌స్టాఫ్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నిర్ణయించారు. అందులో భాగంగానే శుక్రవారం వరంగల్‌ కాకతీయ యూనివర్శిటీలతో పాటు దాని అనుబంధ కాలేజీ టీచింగ్‌స్టాఫ్ ల‌తో మాట్లాడారు. ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల  స్టాఫ్‌తో రోజు విడిచి రోజు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈసందర్భంగా గవర్నర్‌ విూడియాతో మాట్లాడుతూ ఉన్నత విద్యాశాఖ అధికారులతో రెండు వారాల  పాటు ఇంటరాక్ట్‌ కాబోతున్నట్టు తెలిపారు. తద్వారా యూనివర్శిటీల  పనితీరు, విద్యాసంబంధ అంశాలపై వారితో చర్చిస్తామని గవర్నర్‌ తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....