మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది రియాజ్ నైకూ హతం (ఎన్ కౌంటర్ లో తుదముట్టించిన భద్రతా బలగాలు)

మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది రియాజ్ నైకూ హతం

ఎన్ కౌంటర్ లో తుద                     ముట్టించిన భద్రతా బలగాలు

శ్రీనగర్‌,మే6(ఇయ్యాల తెలంగాణ ): జమ్మూకశ్మీర్‌లోని భద్రతా దళాలు  మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది రియాజ్‌ నైకూను హతమార్చాయి. గత రాత్రి నుంచి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది రియాజ్‌ భద్రతా బలగాల  కాల్పుల్లో  మృతిచెందాడు. పుల్వామా జిల్లాలోని అవంతిపురాలో రాత్రి నుంచి భద్రతా దళాలు  కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. అయితే బేగ్‌పుర గ్రామంలో ఉగ్రవాది రియాజ్‌ ఉన్నట్లు గుర్తించారు.  అతను తమ అదుపులోనే ఉన్నాడని ప్రకటించిన భద్రతా  బల గాలు  ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడని పేర్కొంది. హిజ్‌బుల్‌ ముజాయిద్దీన్‌ కమాండర్‌ అయిన రియాజ్‌ తలపై 12 లక్షల  రివార్డు కూడా ఉన్నది. మరో ఎదురుకాల్పుల్లో  ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు ఆర్మీ చెప్పింది.  పాంపోర్‌ జిల్లాలోని శార్‌షాలి గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆ ఉగ్రవాదులు  మరణించారు.  రియాజ్‌ నైకూ కోసం గత 8 ఏళ్ల నుంచి కశ్మీర్‌లోని భధ్రతా దళాలు  ఎదురుచూస్తున్నాయి.  2016లో కశ్మీర్‌లో మిలిటెంట్‌ నేత బుర్హన్‌ వానీ హతమైన తర్వాత నైకూ ఉగ్రనేతగా ఎదిగాడు.  కశ్మీర్‌లో స్థానిక పోలీసుల్ని చంపడంలో రియాజ్‌ మాస్టర్‌మైండ్‌గా ఎదిగాడు. దీంతో దక్షిణ కశ్మీర్‌ జిల్లాల్లో పోలీసు ఒంటరిగా తిరిగేవారు కాదు.  ఉగ్రవాద గ్రూపులో చేరకముందు నైకూ స్థానిక స్కూల్‌లో లెక్కల  టీచర్‌గా చేశాడు. గులాబీ పువ్వు పెయింటింగ్‌ వేయడంలో ఇతను దిట్ట. 33 ఏళ్ల వయసులో రియాజ్‌.. ఉగ్రవాదం వైపు మళ్లాడు. ఈ ఆపరేషన్‌తో గత రెండుమూడు రోజుగా పలువురు అధికారును కోల్పోయిన భద్రతా బలగాలుకు బరోసా దక్కింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....

View Comments (1)