న్యూ డిల్లీ ఆగష్టు 24 (ఇయ్యాల తెలంగాణ );వరల్డ్ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సన్ఫిడే వరల్డ్ కప్ చాంపియన్‌గా అవతరించాడు. ఉత్కంఠగా జరిగిన ఫైనల్లో అతడు భారత గ్రాండ్‌మాస్టర్ రమేష్‌బాబు ప్రజ్ఞానందపై గెలుపొందాడు. టై బ్రేక్‌లో చివరకు కార్ల్‌సన్ విజయం సాధించి కెరీర్‌లో మొదటి ఫిడే వరల్డ్ కప్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. అసమాన పోరాటంతో ఆకట్టుకున్న 18 ఏళ్ల ప్రజ్ఞానంద రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు.