మైదుకూరులో బంద్‌ ప్రశాంతం

కడప సెప్టెంబర్  11 (ఇయ్యాల తెలంగాణ ): తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా మైదుకూరులో బంద్‌ నిర్వహించారు. మైదుకూరు పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో మైదుకూరు టిడిపి ఇన్చార్జి పుట్ట సుధాకర్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున బంద్‌ చేపట్టారు. నాలుగు రోడ్ల కూడలిలో ట్రాఫిక్‌  స్తంభించింది. వాహనాలు నిలిచిపోయాయి.  నిరసనకారులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ చంద్రబాబు అరెస్ట్‌ ను ఖండిచారు. ఈ నేపధ్యంలో పోలిసులకు టీడీపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. తరువాత  టీడీపీ ఇంచార్జ్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ను అరెస్టు చేసి స్టేషన్‌ కు తరలించారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....