ముస్లిం మహిళలు విడాకుల తర్వాత భర్త నుండి భరణం పొందవచ్చు

న్యూఢల్లీ జూలై 10 (ఇయ్యాల తెలంగాణ ): ముస్లిం మహిళలు విడాకుల తర్వాత భర్త నుండి భరణం పొందవచ్చని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెల్లడిరచింది. భార్య భరణ హక్కుకు సంబంధించిన కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ (సీఆర్‌పీసీ)లోని సెక్షన్‌ 125 ప్రకారం ముస్లిం మహిళలు తమ భర్తల నుంచి భరణం పొందవచ్చని సుప్రీంకోర్టు బుధవారం తీర్పునిచ్చింది.న్యాయమూర్తులు బివి నాగరత్న, అగస్టిన్‌ జార్జ్‌ మసిప్‌ాలతో కూడిన ధర్మాసనం.. భార్యకు భరణం పొందే చట్టబద్ధమైన హక్కును సూచించే పాత అతీఖఅలోని సెక్షన్‌ 125 ముస్లిం మహిళలకు కూడా వర్తిస్తుందని పేర్కొంది. భరణం అనేది దాతృత్వం కాదని, వివాహిత మహిళల హక్కు అని, వారి మతంతో సంబంధం లేకుండా వివాహిత మహిళలందరికీ వర్తిస్తుందని బెంచ్‌ నొక్కి చెప్పింది.ఫ్యామిలీ కోర్టు మెయింటెనెన్స్‌ ఆర్డర్‌లో జోక్యం చేసుకోకూడదన్న తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేసిన మహ్మద్‌ అబ్దుల్‌ సమద్‌ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళకు అతీఖఅలోని సెక్షన్‌ 125 కింద భరణం పొందే అర్హత లేదని, బదులుగా ముస్లిం మహిళల (విడాకుల హక్కుల రక్షణ) చట్టం, 1986 ప్రకారం ఉపశమనం పొందాలని సమద్‌ వాదించారు.‘‘సెక్షన్‌ 125 పెళ్లయిన మహిళలకు మాత్రమే కాకుండా మహిళలందరికీ వర్తిస్తుందని.. ఈ క్రిమినల్‌ అప్పీల్‌ను తోసిపుచ్చుతున్నాం’’ అని తీర్పును ప్రకటిస్తూ జస్టిస్‌ నాగరత్న అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....