హైదరాబాద్, సెప్టెంబర్ 20 (ఇయ్యాల తెలంగాణ) : మునుగోడు ఉప ఎన్నికపై ప్రగతి భవన్ లో కీలక సమావేశం మంగళవారం జరిగింది. సిఎం కేసీఆర్ పిలుపుతో మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉదయమె హుటాహుటిన ప్రగతిభవన్ కు చేరుకున్నారు. అభ్యర్థిని ఎప్పుడు ప్రకటించాలనే అంశంపై చర్చ కొనసాగినట్లు సమాచారం. త్వరలో అధికారికంగా అభ్యర్ధి పేరు ప్రకటించే అవకాశం వుంది. మునుగోడు నియోజకవర్గంలో మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పార్టీ కేడర్ కు కూసుకుంట్ల అభ్యర్దిగా కేసీఆర్ సంకేతాలు పంపిన విషయం తెలిసిందే. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం వేదికగా కూసుకుంట్ల పేరును ఎక్స్పోజ్ చేయాలని మంత్రి జగదీష్ రెడ్డికి సూచించినట్లు సమాచారం.
మునుగోడు ఉప ఎన్నికపై ప్రగతిభవన్ లో చర్చ
Leave a Comment