తాడేపల్లిగూడెం సెప్టెంబర్ 22 (ఇయ్యాల తెలంగాణ ); ముదునూరు గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన నిర్మించి ఇటీవల కాలంలో ప్రారంభించారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ముదునూరు, దర్శిపర్రు, వల్లూరు పల్లి, రాచర్ల, అల్లంపురం, ప్రత్తిపాడు, బోడపాడు, బిల్లగుంట, బోడపాడు, రావిపాడు, చింతపల్లి, బి కొందేపాడు, విూనవలూరు, ఆకుతీగపాడు రామచంద్రపురం ఉన్నాయి. రోజువారి డ్యూటీలో భాగంగా ప్రతిరోజు డాక్టర్లు తో పాటు వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లువస్తున్నారు. వ్యాధులకు సంబంధించిన మందులు ఎక్కువ శాతం ఇక్కడే ఇస్తారు,టెస్టులు ఎక్కువ శాతం ఇక్కడే చేస్తారు. చిన్న సర్జరీలు కూడా ఇక్కడే చేస్తారు. పెద్ద ఆపరేషన్లు అయితే తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్ కి పంపిస్తారు, ఉదయం 9 గంటల నుండి రాత్రి ఎనిమిది గంటలు వరకు అందుబాటులో ఉంటుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే రోడ్డు, హాస్పటల్ ఆవరణలో లోతుగా ఉండటంవల్ల వర్షాకాలంలో వైద్య సిబ్బంది, రోగులు, గర్భిణీలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉంటే గర్భిణీలకు పెను ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది, అదేవిధంగా వృద్ధులు కూడా అదే పరిస్థితి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తూర్పు వైపు ప్రహరీ గోడ లేకపోవడం వల్ల విష సర్పాలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమస్యను ప్రజా ప్రతినిధులు ఉన్నత అధికారులు పరిష్కారం చేయాలని ప్రజలు మరియు రోగులు కోరుకుంటున్నారు.
- Homepage
- General News
- ముదునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమస్యల తీష్ట
ముదునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమస్యల తీష్ట
Leave a Comment