ముదిరాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో పేద ముదిరాజ్ విద్యార్థులకు ప్రోత్సాహం

హైదరాబాద్, అక్టోబర్ 4 (ఇయ్యాల తెలంగాణ) : ముదిరాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన పేద ముదిరాజ్ విద్యార్థులకు 5000 రూపాయలు ఆర్ధిక పారితోషకం అందించనుంది.ఈ మేరకు కార్యక్రమానికి హాజరు కావలసినదిగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను కలసి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. పదో క్లాసులో 10/10 వంతు మార్కులు వచ్చిన ముదిరాజ్ విద్యార్థులకు 5000 రూపాయలు నగదు బహుమానం ఇచ్చి వాళ్లను ఉన్నత విద్యా వైపు ప్రోత్సహం అందించడానికి ముదిరాజ్ సేవ సంఘం ముందడుగు వేసింది. పేద ముదిరాజ్ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా ముదిరాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో అన్ని విధాలా కృషి చేస్తామని సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సేవ సంఘం వివిధ జిల్లాల నాయకులు  పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....