ముగిసిన ప్రధానితో AP CM చంద్రబాబు భేటీ

న్యూ ఢల్లీ :జులై 04 (ఇయ్యాల తెలంగాణ ):ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ ముగి సింది. ఏపీకి సంబంధించిన కీలక అంశాలు ప్రధానితో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీకి ఆర్థిక సాయం, ఇతర అంశాలను ప్రధానికి వివ రించినట్లుగా తెలుస్తోంది. బడ్జెట్‌లో ఏపీకి మేలు జరిగేలా కేటాయింపులు చంద్రబాబు కోరినట్లు సమాచారం.అంతకుముందు రాష్ట్రానికి చెందిన ఎన్డీయే ఎంపీలతో కలిసి కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను చంద్రబాబు కలిశారు. ఆయనతో వివిధ అంశాలపై మాట్లాడారు.మధ్యాహ్నం కేంద్రమంత్రులు అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో సీఎం భేటీ అయ్యారు.. సాయంత్రం కేంద్రమంత్రులు మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, హర్దీప్‌ సింగ్‌ పురీతో చంద్రబాబు సమావేశం అయ్యారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....