ముక్కంటి సేవలో Telangana రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి !

శ్రీకాళహస్తి జూన్‌ 19 (ఇయ్యాల తెలంగాణ) : శ్రీ కాళహస్తిశ్వరాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి  కుటుంబ సభ్యులతో  విచ్చేశారు. వారిని దేవస్థానం ఏ.ఈవో సతీష్‌ మల్లి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు.అనంతరం  శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వారిని వారి కుటుంబ సభ్యులను దేవస్థానం అధికారులు శేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏ.ఈఓ సతీష్‌ మల్లి టెంపుల్‌ పి.ఆర్‌.ఓ నాగభూషణ్‌ నాయక్‌,రవి,శ్రీనాథ్‌, టెంపుల్‌ ఇన్స్పెక్టర్‌ సుదర్శన్‌ టెంపుల్‌ సూపర్డెంట్‌,సి.ఎస్‌.ఓ నాగభూషణం యాదవ్‌ మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....