కమాన్ పూర్ ఆగష్టు 25 (ఇయ్యాల తెలంగాణ ):కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగలను విస్మరిస్తున్నాయని ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కోండ్ర శంకర్ మాదిగ అన్నారు.మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్రం అధ్వర్యంలో పెద్దపెల్లి జిల్లా ముఖ్యల సమావేశం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి కొండ్ర శంకర్ మాదిగ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెడతామని హావిూ ఇవ్వడం జరిగింది హావిూ హావిూగానే మిగిలిపోయింది రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు దేశవ్యాప్తంగా జాతీయ పార్టీలు మాదిగలను మాటలతోనే మభ్యపెట్టి రాజకీయ అధికారాన్ని అవకాశాలను పొందుతున్నారు ఏ పార్టీ అయినా మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలైన ప్రజలకు కల్పించాల్సినటువంటి హక్కులు మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు అని అన్నారు. వాస్తవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీలను ఓటు బ్యాంకుగా వాడుకోవడం జరుగుతుంది అని ఆరోపించారు.అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర క్యాబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఎస్సీ వర్గీకరణకై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సిన బాధ్యత కేసిఆర్ దేనని తెలియజేస్తున్నాము .పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అందులో మూడు ఎస్సీ రిజర్వుడు స్థానాలు ఉన్నాయి అందులో మాదిగలకు సైతం కేసీఆర్ మొండి చేయి చూపారని అన్నారు. ధర్మపురి, చెన్నూరు, బెల్లంపల్లిమూడు నియోజకవర్గాల్లో ఒకరికి కూడా మాదిగ కులానికి చెందిన వారికి టిఆర్‌ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా మాదిగ కులాన్ని వంచనకు గురిచేసింది
- Homepage
- General News
- మాదిగలను విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
మాదిగలను విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
Leave a Comment