మాతృదినోత్సవం పురస్కరించుకొని నిత్యావసర సరుకుల పంపిణి

మాతృదినోత్సవం పురస్కరించుకొని నిత్యావసర సరుకుల పంపిణి


హైదరాబాద్ , మే 12,ఇయ్యాల తెలంగాణ:   జై భీమ్, మాతృదినోసవం సందర్బంగా  నిత్యావసర వస్తువులు పంపిణి చేయడం  జరిగింది. ఎస్సీ  డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రోజు పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో సంఘం  వ్యవస్థాపక అధ్యక్షులు పులికంటి నరేష్  చేతులమీదుగా పేద ప్రజలకు  నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగినది,

ఈ సందర్బంగా  అధ్యక్షులు పులికంటి నరేష్  మాట్లాడుతూ అందరికి మాతృదినోత్సవ  శుభాకాంక్షలు తెలుపుతూ,  కొరోనా వాళ్ళ పేద ప్రజలు బయటకు వెళ్లి రోజువారీ కూలి చేయలేని పరిస్థిలులో ఉన్నారని  అందువల్ల నాతో తోచినంత  సహాయం చేస్తున్నాను కావున ప్రతిఒక్కరు  కూడా తమకు తోచిన విధంగా నిరుపేద ప్రజలకు సహాయం  చేయాలనీ పిలుపు నిచ్చారు.ఎందరో నిరుపేదలు కరోనా మూలంగా పస్తులుంటున్నారని గుర్తు చేశారు.

కావున కష్ట కాలంలో ప్రతి ఒక్కరు చేయూతనందించాలని తెలిపారు.   కరోనా ని తరిమికొట్టే క్రమంలో అందరు లాక్ డౌన్ నియమాలు పాటిస్తూ  ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  సొసైటీ సభ్యులు, శేఖర్ గారు , సునీల్ గారు,  పండు గారు, మధు గారు , ఆనంద్ గారు , స్వామి గారు,  యొనగారు, తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....