మహిళా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం

 

న్యూఢల్లీ జూలై 26 (ఇయ్యాల తెలంగాణ ): రాజ్యాంగ నిబంధనలు బీజేపీ పాలిత రాష్ట్రాలకు వర్తించవా అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. నాగాలాండ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించకపోవడంపై దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా మంగళవారం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ప్రతిపక్ష ప్రభుత్వాలపై విూరు కఠిన చర్యలు తీసుకొంటారు. విూ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలపై మాత్రం విూరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?’ అని కోర్టు నిలదీసింది.‘మహిళా రిజర్వేషన్లు రాజ్యాంగ నియమాల ప్రకారం అమలు చేయాల్సినవి. ఈ బాధ్యత నుంచి విూరెలా తప్పుకుంటారో నాకు అర్థం కావడం లేదు’ అని జస్టిస్‌ ఎస్కే కౌల్‌ వ్యాఖ్యానించారు. నాగాలాండ్‌లో మహిళల విద్యా, ఆర్థిక, సామాజిక స్థాయి మెరుగ్గా ఉన్నాయని.. అలాంటి రాష్ట్రంలో మహిళా రిజర్వేషన్లు అమలు చేయలేకపోవడాన్ని తాము అంగీకరించలేమని కోర్టు తెలిపింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....