మహారాష్ట్రలో ఘోర ప్రమాదంలో 10 మంది మృతి

ముంబై  జూలై 4 (ఇయ్యాల తెలంగాణ ): మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో మంగళవారం దారుణం జరిగింది. హైవేపై ప్రయాణిస్తున్న ఓ లారీ అదుపుతప్పి, వాహనాలను ఢీకొడుతూ, ఓ హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికిపైగా గాయపడ్డారు. గాయపడినవారిని సిర్పూర్‌, ధూలేలలోని ఆసుపత్రులకు తరలించి, చికిత్స చేయిస్తున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మధ్య ప్రదేశ్‌ నుంచి ధూలే వైపు వెళ్తున్న లారీ మంగళవారం ఉదయం 10.45 గంటల ప్రాంతంలో ముంబై`ఆగ్రా హైవేపై పలస్నేర్‌ గ్రామం సవిూపంలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ లారీ బ్రేకులు ఫెయిల్‌ అవడంతో డ్రైవర్‌ అదుపు చేయలేకపోయారు. దీంతో రెండు మోటారు సైకిళ్లను, ఓ కారును, మరో కంటెయినర్‌ను ఢీకొట్టింది. అదే వేగంతో బస్టాప్‌ పక్కన ఉన్న ఓ హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత తలక్రిందులైంది. ఈ ఘోర ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికిపైగా గాయపడ్డారు. గాయపడినవారిని సిర్పూర్‌, ధూలేలలోని ఆసుపత్రులకు తరలించి, చికిత్స చేయిస్తున్నారు. ఈ ప్రమాదం బాధితుల్లో బస్టాప్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు కూడా ఉన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....