మరో నాలుగు మండలాల్లో దళిత బంధు

13న ప్రగతిభవన్‌లో  సవిూక్షించనున్న సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌11(ఇయ్యాల తెలంగాణ): దళితబంధును పైలట్‌ ప్రాజెక్టుగా అమలు పరచనున్న నాలుగు మండాలల్లో పథకం అమలు కోసం ఈ నెల 13న మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రగతి భవన్‌లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గంతో పాటు మధిర నియోజక వర్గంలోని చింతకాని మండలం, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం, జుక్కల్‌ నియోజకవర్గంలోని నిజాం సాగర్‌ మండలాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా చేపడుతామని ఇటీవలే సీఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణ కోసం దళిత బంధు పథకం అమలు సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. ఇప్పటికే దళితబంధు హుజూరాబాద్‌లో అమలు చేస్తున్నారు. అక్కడ సిఎం కెసిఆర్‌ స్వయంగా పథకాన్ని ప్రారంభించారు. తాజాగా ఇప్పుడు మరో నాలుగు మండలాల్లో దీనిని అమలు చేసేందుకు నిర్ణయించారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....