మరోమారు ప్రేక్షకుల ముందుకు శ్రీదేవి సోడా సెంటర్‌

ఇటీవల సుధీర్‌ బాబు, తెలుగమ్మాయి ఆనంది హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ’శ్రీదేవి సోడా సెంటర్‌’. ’పలాస 1978’ ఫేమ్‌ కరుణ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 27న విడుదలైంది. ఇదిలా ఉంటే దీపావళి కానుకగా ఈ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ  ఓటీటీ సంస్థ జీ5లో నవంబరు 4 నుంచి స్ట్రీమింగ్‌ కానుందని సోషల్‌ విూడియాలో వెల్లడిరచారు. కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టిన తర్వాత థియేటర్లలో విడుదలైన చిత్రాల్లో ’శ్రీదేవి సోడా సెంటర్‌’ కూడా ఒకటి. విలేజ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీకి ఎన్నో అంచనాల మధ్య విడుదలై కొన్ని వర్గాల ప్రేక్ష్‌కుల బాగా ఆకట్టుకోగా.. మరికొందరి నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇందులో నరేశ్‌, షావుల్‌ నవగీతమ్‌ కీలక పాత్రలు పోషించారు. 70ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైనమెంట్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, దేవిరెడ్డి శశి నిర్మించారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....