మరణించినవారందరకీ పరీక్షలు సాధ్యం కావు

స్పష్టం చేసిన మంత్రి ఈటెల  రాజేందర్‌

హైదరాబాద్‌,జూన్‌9(ఇయ్యాల తెలంగాణ ): మృతి చెందిన వారికి కొవిడ్‌ పరీక్షలు  చేయాలనడం అశాస్త్రీయమైనదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల  రాజేందర్‌ వ్యాఖ్యానించారు. మృతులందరికీ కరోనా పరీక్షలు  చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో విూడియాతో ఆయన మాట్లాడారు. కరోనా బారిన పడిన వారికి గాంధీ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలందిస్తున్నట్లు చెప్పారు. కరోనా సోకిన వారందరినీ బతికించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వైద్యులు  తమ ప్రాణాలను లెక్కచేయకుండా వైద్య సేవలు  అందిస్తున్నారని కొనియాడారు. చనిపోయిన వారికి కొవిడ్‌ పరీక్షలు  చేయాలనడం అవగాహన రాహిత్యంతో కూడుకున్నది. ఐసీఎంఆర్‌ నిబంధనల్లో ఎక్కడ కూడా భౌతిక కాయానికి పరీక్షలు  నిర్వహించాలని చెప్పలేదు. రాష్ట్రంలో నిత్యం వెయ్యిమంది మరణిస్తున్నారు. దేశంలో నిత్యం 30వేల  మంది చనిపోతున్నారు. వారందరికీ టెస్టు చేయడం సాధ్యం కాదని ఈటల  స్పష్టం చేశారు.
iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....