మద్యం దుకాణాలు సరే..దేవాలయాలు తెరవరా?

మద్యం దుకాణాలు  సరే..దేవాలయాలు  తెరవరా?

దేశవ్యాప్తంగా అనేకుల  ఎదురుచూపు

న్యూఢీల్లీ ,మే7(ఇయ్యాల తెలంగాణ ): దేశంలో మద్యం దుకాణాలు  తెరిచిన తర్వాత మందిరాలు  మాత్రం ఏం పాపం చేశాయన్న వాదన బయలు దేరింది. పలువురు ఆలయాను తెరవాలన్న డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. అయితే దీంతో భౌతికి దూరం అన్న నినాదం పోతుందన్న భయం వెన్నాడుతోంది

అందుకే గుళ్లూగోపురాలకు అనుమతి లేదని ప్రభుత్వాలు  స్పస్టం చేశాయి. దేవాలయాలు  తెరవాలన్న విషయమై చర్చ కూడా ప్రారంభమైంది. వారణాసిలో గంగానది ఒడ్డున  పడవలు  నడిపేవారు, పూజలు  పునస్కారాలు  చేసే పూజారులు , అర్చకులు , భిక్షాటనపై ఆధారపడిన అభాగ్యులు  కూడా కరోనా వైరస్‌ మూలంగా మూతపడ్డ తమ జీవన ద్వారాలు  ఎప్పుడు తెరుచుకుంటాయని అడుగుతున్నారు.

  
ఒక రకంగా సమస్య నుంచి ప్రజల  దృష్టిని మళ్లించేందుకు ఆర్థిక వ్యవస్థతో పాటు ధార్మిక వ్యవస్థ కూడా అవసరమే. దీర్ఘకాలంగా లాక్‌డౌన్‌ కారణంగా ఈ రంగాల్లో  ఉన్నవారి జీవనం దుర్భరంగా మారింది. తిరుపతి, కాశీ, శ్రీశైలం, యాదాద్రి ఇలా అనేక ఆలయాలు  మూతపడే ఉన్నాయి. వీటి ఆధారంగా నడుస్తున్న ఆర్థిక వ్యవహారాలు  ఆగిపోవడంతో కోట్లల్లో ఆదయాలు పడిపోయాయి. 




.
iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....