మత సామరస్యానికి ప్రతీక రంజాన్‌

హైదరాబాద్‌, ఏప్రిల్ 22 (ఇయ్యాల తెలంగాణ) : మత సామరస్యానికి ప్రతీక రంజాన్‌  అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. శనివారం రంజాన్‌ పర్వదినం సందర్భంగా సనత్‌ నగర్‌ లోని వెల్ఫేర్‌ సెంటర్‌ గ్రౌండ్‌ లో వేలాది మంది ముస్లీం సోదరులు నిర్వహించిన సామూహిక ప్రార్ధనలలో మంత్రి పాల్గొన్నారు. ప్రార్ధనల అనంతరం ముస్లీం సోదరులను ఆలింగనం చేసుకొని రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ సందర్భంగా నెల రోజుల పాటు ఎంతో నిష్ఠతో ఉపవాస దీక్షలు చేస్తారని తెలిపారు. రంజాన్‌ ను ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సనత్‌ నగర్‌ డివిజన్‌ పార్టీ అధ్యక్షులు కొలన్‌ బాల్‌ రెడ్డి, నాయకులు సరాఫ్‌ 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....