మట్టి లంబోదరుడే సర్వ విధాలా శ్రేష్టం : పజ్జన్న

పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతిని పూజిద్దాం


హైదరాబాద్, సెప్టెంబర్ 9 (ఇయ్యాల తెలంగాణ) : కరోనా నేపథ్యంలో మట్టి గణపతిని పూజించి, నిమజ్జనం చేయడం వల్ల ప్రకృతికి ఎంతో మంచిదని తెలంగాణ ఉప సభాపతి (స్పీకర్) తీగుళ్ల పద్మారావు గౌడ్ తెలిపారు. వినాయక చవితి వేడుకలను పురస్కరించుకొని ఈ రోజు సికింద్రాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల స్థానిక ప్రజలకు మట్టి గణపతి  విగ్రహాలను అందజేశారు.సుమారు 100 మందికి పైగా ఆయన వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. మట్టి వినాయకుణ్ణి పూజించడం అన్ని విధాలా శ్రేయస్కరమని ఈ సందర్బంగా గుర్తుచేశారు. వాటిని నిమజ్జనం చేయడం కూడా తేలికగా జరిగిపోతుందని తెలిపారు. మట్టి గణేశున్ని పూజించి నిమజ్జనం చేయడం ద్వారా ప్రకృతికి ఎంతో మేలు జరుగుతుందని ఉప సభాపతి కోరారు.  ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు స్పీకర్ అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు  చేయడం ఆనందంగా ఉందన్నారు. గణేశుని ఆశీస్సులతో కరోనా మహమ్మారి ఈ భూభాగం నుండి పూర్తిగా తొలగిపోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆ లంబోదరుడి ని  పూజిస్తున్నాని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెరాస యువ నాయకుడు తీగుళ్ల కిషోర్ గౌడ్ , G.రాజేష్ గౌడ్ పెద్దన్న, Dr. గంగాధర్, ప్రవీణ్ గౌడ్ ,A.ప్రకాష్, రాజేశ్ తో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....