మగువా మగువా..మద్యం కోసం తెగువా!

మగువా మగువా..మద్యం కోసం తెగువా!
క్యూ లైన్ లలో దర్శన మిచ్చిన తెగువ

హైదరాబాద్‌,మే6(ఇయ్యాల తెలంగాణ ):  తెలంగాణా రాష్ట్రంలో లిక్కర్‌ అమ్మకాలు  మొదలు  కావడంతో గతంలో ఎప్పుడూ లేని చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి.  లాక్‌డౌన్‌కు ముందు గుట్టుగా మద్యం కొనుగోళ్లు జరిగేవి. మాల్స్‌లో అవసరమైన వారు తెచ్చుకునే వారు. ఎవరు కొంటున్నారో కూడా తెలిసేది కాదు. కానీ లాక్‌డౌన్‌  నేపథ్యంలో  తెంగాణా సర్కార్‌ లిక్కర్‌ అమ్మకాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వటంతో మద్యం ప్రియులు  వైన్స్‌ ముందు బారులు  తీరుతున్నారు. ఇందులో వింతేవిూ లేకున్నా యువతలు , మహిళలు  కూడా క్యూ కట్టి మద్యం కొనుగోళ్లు చేపట్టడం చోద్యంగా మారింది. పురుషులకు పోటీగా మహిళలు  కూడా మద్యం కోసం క్యూ లైన్లలో నిబడుతున్న దృశ్యాలు  కనిపించాయి. హైదరాబాద్‌ లోని చాలా ప్రాంతాల్లో మహిళలు , అమ్మాయిలు  మద్యం కోసం వైన్స్‌ ముందు నిల్చున్న  తీరు  కనిపించింది. బెంగళూరు సహా కొన్ని మెట్రో సిటీల్లో మహిళలు , అమ్మాయిలు  కూడా వైన్స్‌ షాపుల  ముందు క్యూలైన్లలో దర్శనం ఇచ్చారు. ఎలాంటి బెదురు  లేకుండా లిక్కర్‌ కోసం పురుషులతో పోటీ పడ్డారు. ఇప్పుడు ఆడామగా తేడా లేకుండా మందు తాగటం మామూలే అనడానికి ఇది నిదర్శనంగా నిలిచింది. ఇకపోతే లిక్కర్‌ కోసం వైన్స్‌ దగ్గరకు వచ్చిన మహిళ కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో చాలా చోట్ల ఈ దృశ్యాలు  దర్శనమిచ్చాయి. వైన్స్‌ ఎదుట మహిళలు , అమ్మాయిలు  క్యూలైన్లలో సామాజిక దూరం పాటిస్తూ , ముఖాలకు మాస్కు కట్టుకుని నిలబడ్డారు. మేము విూకు ఏ మాత్రం తీసిపోము అన్న చందంగా మహిళలు  పోటీ పడ్డారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....