’భోళా శంకర్‌’ లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్న మెగాస్టార్‌ చిరంజీవి, కీర్తి సురేష్‌

మెగాస్టార్‌ చిరంజీవి మోస్ట్‌ ఎవైటెడ్‌ మెగా మాస్‌`యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భోలా శంకర్‌’. స్టైలిష్‌ మేకర్‌ మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా  కథానాయికగా నటిస్తుండగా, చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్‌ నటిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పటి వరకు 14.5 ఓG వ్యూస్‌ తో వీడియో టాప్‌ ట్రెండిరగ్‌లో ఉంది. చిరంజీవి స్వాగ్‌, అద్భుతమైన స్క్రీన్‌ ప్రెజెన్స్‌, పవర్‌ ఫుల్‌ డైలాగ్‌ డెలివరీ అభిమానులు, మాసెస్‌ ఎంతగానో ఆకట్టుకున్నాయి. భోళా శంకర్‌ యాక్షన్‌, మాస్‌ ఎలిమెంట్స్‌ ఎక్కువగా ఉంటాయని ట్రైలర్‌ ద్వారా అర్థమైంది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. అన్న చెల్లెల బంధం సినిమాకు ప్రధాన ఆకర్షణ. అన్న చెల్లెలుగా చిరంజీవి, కీర్తి సురేష్‌ల సీక్వెన్స్‌లు సినిమాకు బలంగా నిలుస్తాయి. వీరిద్దరూ బ్యూటీఫుల్‌  కెమిస్ట్రీని పంచుకున్నారు. ఈ రెండు పాత్రల మధ్య హ్యుమర్‌, డ్రామా, భావోద్వేగాలు ఉంటాయి. కాబట్టి, భోళా శంకర్‌ ఒక వర్గం ప్రేక్షకులకు పరిమితం కాదు. మాస్‌, యూత్‌, ఫ్యామిలీస్‌ని సమానంగా ఆకట్టుకునే సినిమాగా ఉంటుంది. అనిల్‌ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్‌ సంగీతం, డడ్లీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్‌ కె వెంకటేష్‌ ఎడిటర్‌ గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా పని చేస్తున్నారు. సత్యానంద్‌ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్‌ అందిస్తున్నారు. కిషోర్‌ గరికిపాటి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత.

భోళా శంకర్‌ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....