భూమి, చంద్రున్ని ఫోటో తీసిన చంద్రయాన్‌`3.. పిక్స్‌ షేర్‌ చేసిన ఇస్రో

హైదరాబాద్‌ ఆగష్టు 10 (ఇయ్యాల తెలంగాణ ): కొన్ని రోజుల క్రితం చంద్రయాన్‌`3 స్పేస్‌క్రాఫ్ట్‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నింగిలోకి పంపిన విషయం తెలిసిందే. అయితే ఆ స్పేస్‌క్రాఫ్ట్‌ తీసిన ఫోటోలను ఇవాళ ఇస్రో రిలీజ్‌ చేసింది. చంద్రయాన్‌`3లో ఉన్న ల్యాండర్‌ ఇమేజ్‌ కెమెరాల నుంచి భూమిని ఫోటో తీశారు. ఇక ఆ స్పేస్‌క్రాఫ్ట్‌ చంద్రుడి కక్ష్యలోకి వెళ్లిన తర్వాత చంద్రుడి ఫోటోను కూడా తీసింది. ల్యాండర్‌ హారిజంటల్‌ వెలాసిటీ కెమెరా ఆ ఫోటోను క్లిక్‌ అనిపించింది. చంద్రయాన్‌`3 విజయవంతంగా ఆగస్టు 5వ తేదీన చంద్రుడి కక్ష్యలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఆగస్టు 23వ తేదీన ల్యాండర్‌ చంద్రుడిపై దిగే అవకాశాలు ఉన్నాయి. చంద్రుడి ఫోటోలో క్రాటర్స్‌ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎడ్డింగ్టన్‌, అరిస్టార్‌చస్‌, పైతాగరస్‌, ఓసియన్‌ ప్రొసెల్లరమ్‌ లాంటి బిల్హాలు ఆ పిక్‌లో కనిపించాయి. చంద్రుడి ఉత్తర ద్రువంలో ఉన్న బిల్వాల్లో.. ప్రొసెల్లరమ్‌ చాలా పెద్దది. అది సుమారు 2500 కిలోవిూటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. దాదాపు 4 లక్షల చదరపు కిలోవిూటర్ల దూరాన్ని కవర్‌ చేస్తుంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....