జపాన్`ఇండియా మధ్య నావికా బలం మరింత బలపడుతుంది..ఏడో వార్షిక జిమెక్స్`2023 సర్వ సత్తాక ప్రదర్శనలు ప్రారంభం…
విశాఖ జులై 7, (ఇయ్యాల తెలంగాణ ):
భారత్`జపాన్ దేశాల మధ్య భద్రత, అంతర్గత సత్తా తెకునేందుకు వీలు గా జిమెక్స్`2023 పేరిట మూడ్రోజుల పాటు ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు ఇరు దేశాల నేవీ ప్రతినిధులు ప్రకటిం చారు. పసిఫిక్ రీజియన్ లో 12ఏళ్ల తరువాత ఏడో వార్షిక ద్వైపాక్షిక ఒప్పం దాల ఒడంబడిక నేపథ్యంలో గాలి, నీటి ఉపరితలం,సముద్ర భూగర్భం లోనూ సర్వసత్తాక ప్రదర్శనలు చేసి ఒకరి బలాలు ఒకరు తెల్సుకుంటామ ని పేర్కొన్నారు.అయితే ఈ ప్రదర్శన కేవలం ఇరుదేశాల మధ్య స్నేహ భావ సంబంధాలు పెంచుకునేందుకే గానీ, సాంకేతికత సహా పలు అంశాల్లో ఏటి కేడు బలం పెంచుకునే ఉద్దేశ్యం మాత్రమేనన్నారు. విశాఖలోని డాక్ యార్డులో నిలిపిన ఐఎన్‌ఎస్ కొమర్తా షిప్ లో భారత్ తరపున రియర్ అడ్మిరల్ గురుచరణ్ సింగ్, జపాన్ తరపున ఆర్‌ఏ నిషియామా మాట్లాడా రు.ఇరుదేశాల మధ్య స్నేహ సంబంధా లు కొనసాగుతున్నాయని తెలిపారు…జపాన్ ఇండియా మారిటైమ్ ఎక్సర్ సైజ్`2023..గురుచరణ్ మాట్లాడుతూ ఇరు దేశాల నేవీ సిబ్బంది ప్రస్తుతం హార్బర్ లో తమ నైపుణ్యం ప్రదర్శిస్తున్నారని, సీ ఫేస్ లో కూడా 8నుంచి 10వరకు మళ్లీ ప్రదర్శనలు ఉంటాయన్నారు. వృత్తి పరంగా ఏళ్ల తరబడి పొందిన సం యుక్త శిక్షణ ఇక్కడ ఉపయోగపడు తుందని, గతంలో నిర్వహించిన మిలాన్, వచ్చే ఫిబ్రవరిలో మరోమారు నిర్వహించే మిలాన్ ప్రదర్శనలకు కూడా ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు. షిప్, ఎయిర్ క్రాఫ్ట్, ఫైటర్, ట్యా0కర్, సబ్ మెరైన్ వంటి వాటితో సర్వ సత్తాక ప్రదర్శనలు చేయడం వల్ల జపాన్`ఇండియా నేవీ మధ్య మరింత స్నేహాభావం పెరుగు తుందని భావిస్తున్నామన్నారు.