మాస్కొ, జూలై 9, (ఇయ్యాల తెలంగాణ) : ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రష్యా పర్యటనలో ఉన్న ఆయన ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాను ఒంటరిగా రష్యాకు రాలేదని 140 కోట్ల మంది భారతీయుల ప్రేమతో వచ్చానన్నారు. భారత్ జీ`20 సదస్సును విజయవంతంగా నిర్వహించిందని..డిజిటల్ పేమెంట్లలో సరికొత్త రికార్డ్‌లను సృష్టించామన్నారు. దేశం మరుతోందని ప్రపంచం మొత్తం గుర్తిస్తోందన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జీని నిర్మించాం.. పదేళ్లలో ముఫ్పై వేల కిలోవిూటర్ల రైల్వే లైన్ల ఎలక్ట్రిఫికేషన్లు చేశాం .. పదేళ్లలో ఎయిర్ పోర్ట్‌ల సంఖ్యను రెట్టింపు చేస్తామని ప్రకటించారు. గత పదేళ్లలో జరిగిన అభివృద్ది ట్రైలర్ మాత్రమే .. అసలు అభివృద్ధి ముందు ముందు ఉంటుందన్నారు. దేశాభివృద్దిలో 140 కోట్ల భారతీయుల కృషి ఉందని.. సవాలు..సవాళ్లు నా డీఎన్‌ఏలో ఉన్నాయి. గత పదేళ్లలో దేశంలో జరిగిన అభివృద్దిపై ప్రపంచమే ఆశ్చర్యపోయిందని గుర్తు చేశారు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్ 15 శాతం సహకరిస్తోందన్న మోదీ.. 2014కి ముందు అంధకారంలో ఉందన్నారు. ఐసీసీ వరల్డ్ టీ20లో భారత్ విజయాన్ని విూరు ఘనంగా జరుపుకున్నారు. విజయమే అంతిమ లక్ష్యం. భారత యువత చివరి క్షణం వరకు పట్టు వదలరని ప్రశంసించారు. ప్రతి భారతీయుడు దేశాన్ని మార్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. భారతదేశ విజయాల గురించి ఎన్నారైలు గర్వంగా మాట్లాడుతున్నారని.. ఈ రోజు భారత్ చంద్రుని భాగంలోకి చంద్రయాన్ పంపింది. మరే ఇతర దేశం ఆ స్థాయికి చేరుకోలేదని గుర్తు చేశారు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను భారత్ కలిగి ఉందన్నారు. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ అగ్రగామిగా కొనసాగుతోందని.. భారత్‌ను మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రకటించారు.
నెల రోజుల క్రితం మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాను. నా మూడో టర్మ్‌లో మూడిరతల శక్తితో పని చేస్తానని ఆ రోజు ప్రతిజ్ఞ చేశానని అని ప్రధాని మోదీ ప్రవాస భారతీయలగు గుర్తు చేశారు. ప్రధానిగా మూడో సారి బాధ్యతలు చేపట్టిన మోదీ తొలిసారి రష్యాలో పర్యటిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య పలు అంశాలపై చర్చలు జరగనున్నారు, ఫైటర్ జెట్ ూఙ`57పై ఒప్పందం. భారతదేశంలో యాంటీ ట్యాంక్ షెల్స్‌ను తయారీ పరిశ్రమకు సంబంధించి ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది.
భారత్ కు ఘన స్వాగతం
మై బెస్ట్ ఫ్రెండ్ మోదీ. భారత్`రష్యా బంధం ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి ఈ ఒక్కమాట చాలు. మాస్కోలో అచ్చంగా ఇదే జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ఆకాశానికి ఎత్తేశారు. తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ సంబోధించారు. రష్యాకు వచ్చిన మన ప్రధాని మోదీకి మాస్కో అవతల ఉన్న అధ్యక్షుడి నివాసంలో లభించిన గ్రాండ్ వెల్‌కమ్ ఇది. అమెరికా, యూరప్ తోపాటు మాజీ సోవియట్ దేశాలు పుతిన్‌పై కత్తులు నూరుతున్నవేళ, భారత ప్రధాని టూర్, రష్యాకు పెద్ద బలాన్ని, గొప్ప రిలీఫ్‌ని ఇచ్చింది. కరోనా తర్వాత ప్రధాని తొలిసారి రష్యా వెళ్లారుఇది పూర్తి అధికారిక కార్యక్రమం కాదు. కానీ మర్యాదపూర్వకంగా సాగిన ప్రైవేట్ కార్యక్రమం. పెద్ద ఎస్టేట్‌లా కనిపిస్తున్న ఈ ప్రాంతంలో మోదీ`పుతిన్ గంటపాటు చర్చించారు. షేక్‌హ్యాండ్‌లు, ఆలింగనాలు, బ్యాటరీ వాహనాల్లో ప్రయాణిస్తూ, ఇద్దరు నేతలు ప్రపంచ దేశాలను ఆకర్షించారు. భారత్`రష్యా మధ్య ఉన్న చిరకాల మైత్రీబంధానికి ఈ విూటింగ్ ఒక నిదర్శనం. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరుదేశాధినేతలు ఈ చాయ్‌పే చర్చలో, డిన్నర్ విూటింగ్‌లో మాట్లాడుకున్నారు,ఈ క్రమంలో రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ రష్యా ఆర్మీలో పనిచేస్తున్న భారతీయులను స్వదేశానికి రప్పించే అంశాన్ని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రస్తావించారు. దీని తరువాత, అధ్యక్షుడు పుతిన్, భారతీయులు త్వరలో దేశానికి తిరిగి వస్తారని ప్రధాని మోదీకి హావిూ ఇచ్చారు.వాస్తవానికి, రష్యా సైన్యంతోపాటు ఉక్రెయిన్‌పై పోరాడటానికి భారతీయ పౌరులను బలవంతంగా తరలిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. భద్రతా సహాయకులుగా పని చేసేందుకు భారతీయులను మోసపూరితంగా సరిహద్దులకు పంపుతున్నారు కొందరు ఏజెంట్లు. నవంబర్ 2023 నుండి రష్యా`ఉక్రెయిన్ సరిహద్దులో దాదాపు 18 మంది భారతీయులు చిక్కుకుపోయారని ఒక ఏజెంట్ సమాచారం ఇచ్చారు. ఈ సమయంలో ఒకరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇద్దరు దేశాధినేతల భేటీతో బలవంతంగా చిక్కుపోయిన భారతీయులకు విముక్తి లభిస్తోంది.ఇదిలావుంటే, రష్యా అధినేత పుతిన్‌తో ప్రధాని మోదీ ఇప్పటికే డిన్నర్ విూటింగ్ నిర్వహించారు. ఇవాళ రెండు దేశాల ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగుతాయి. అలాగే రొసాటోమ్ పెవిలియన్‌ను ప్రధాని మోదీ సందర్శిస్తారు. న్యూక్లియర్ టెక్నాలజీలో రష్యా సాధించిన విజయాలకు సంబంధించిన ఎగ్జిబిషన్‌లో మోదీ పాల్గొంటారు. ఆ తర్వాత 22వ రష్యా`ఇండియా సదస్సులో పుతిన్‌తో కలిసి మోదీ పాల్గొంటారు.అయితే ప్రధాని మోదీ రష్యా టూర్‌పై అమెరికా ఆచితూచి స్పందించింది. ఉక్రెయిన్ విషయంలో ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు అనుగుణంగానే, మోదీ స్పందించాలని అగ్రరాజ్యం కోరింది. భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అనీ, అయితే ఇందులో రష్యా విషయంలో సంబంధాలు కూడా ముఖ్యమేనని అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ చెప్పారు.