భారత్‌కు త్వరలోనే రఫేల్ యుద్ద విమానాలు
జూలై చివరిలోగా నాలుగు రఫేల్ ఫైటర్స్
న్యూఢిల్లీ ,మే15(ఇయ్యాల తెలంగాణ ): కరోనా కారణంగా ఆగిపోయిన రఫెల్ యుద్దవిమానాలు త్వరలోనే భారత్‌కు రానున్నాయి. దీంతో త్వరలో భారత వైమానిక సామర్థ్యం పెరగనున్నది. రఫేల్ యుద్ధ విమానాలు .. భారత్‌కు రానున్నాయి. జూలై చివరిలోగా నాలుగు రఫేల్ విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్‌కు రానున్నట్లు తెలుస్తున్నది. వాస్తవానికి మే చివరిలోగా యుద్ధ విమానాలు డెలివరీ కావాల్సి ఉన్నప్పటికీ కరోనా వైరస్ నేపథ్యంలో ఆ యుద్ధ విమానా డెలివరీ వాయిదా పడిరది. రఫేల్ విమానాలను నడిపే భారతీయ పైట్లు కూడా శిక్షణ పూర్తి చేసుకున్నారు. 36 రఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్‌తో 60 వేల కోట్ల డీల్‌ను భారత్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీంట్లో మూడు రెండు సీట్ల విమానాలు , ఒకటి సింగిల్ సీటర్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంబాలా ఎయిర్‌బేస్‌కు విమానాలు రానున్నాయి. రఫేల్ కొనుగోలులో కీలక పాత్ర పోషించిన మాజీ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఆర్‌కే బదౌరియాకు సముచిత గౌరవం ఇవ్వనున్నారు. విమానాల టెయిల్ నెంబర్లకు ఆర్‌కే సిరీస్ ఇవ్వనున్నారు. 17 గోల్డెన్స్ ఆర్సో స్క్వాడ్రన్ పైట్ తొలి విమానాన్ని భారత్‌కు తీసుకురానున్నారు. మార్గమధ్యంలో మిడిల్ ఈస్ట్‌లో ఉన్న ఫ్రెంచ్ ట్యాంకర్‌లో ఇంధనం నింపనున్నారు. వాస్తవానికి సింగిల్ జర్నీలో ఇండియాకు రావొచ్చు, కానీ చిన్న కాక్‌పిట్‌లో సుమారు 10 గంటల పాటు కూర్చోవడం సరికాదు అని అధికారులు పేర్కొన్నారు.