భాజపా సనత్ నగర్ కరోనా వారియర్స్ 42 వ రోజు అన్న విత

భాజపా సనత్ నగర్ కరోనా వారియర్స్ 42 వ రోజు అన్న వితరణ




భాజపా మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యేచన్ సురేష్  ఆకూరి శ్రీనివాస్ రావు ల నేతృత్వంలో 42 వ రోజు “ఫీడ్ ది నీడి” కార్యక్రమాన్ని నిర్వహించి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించినట్లు యువమోర్చా నాయకుడు పి సునీల్ కుమార్, దళిత మోర్చా నాయకుడు పొలిమేర సంతోష్ కుమార్ లు వెల్లడించారు.

స్వామి టాకీస్ కాంప్లెక్స్ లేబర్ అడ్డా వద్ద హైదరాబాద్ కరోనా వారియర్స్ టీం సనత్ నగర్ నిర్వహించిన “ఫీడ్ ది నీడి”  41 వ రోజు కార్యక్రమానికి శ్రీధర్ నాయుడు ఆర్థిక సహాయాన్ని అందించి కార్యక్రమ ముఖ్య అతిథిగా విచ్చేసిన GHMC మాజీ అధికారి ఆకూరి శేషగిరి రావు, యేచన్ సురేష్, ఆకూరి శ్రీనివాస్ రావు, శ్రీమతి చిలుక సరిత, కుందనం మోహన్, రాజేష్ ముదిరాజ్, పి సునీల్ కుమార్, పొలిమేర సంతోష్ కుమార్, జె కె ఠాకూర్  లతో కలిసి అన్నార్థులకు ఆహార పొట్లాలను అందచేశారు. 

ఈ కార్యక్రమానికి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తాళ్ళ జైహింద్ గౌడ్, లక్ష్మణ్ పటేల్, విట్టల్ మురళి, శంకర్, విజయ్, కాసాని శివప్రసాద్ గౌడ్, సరిత శ్రీనివాస్ గౌడ్, నరేష్ అరుణ్ గౌడ్, మిథుల్ రాజ్, ఫణిమాల, కార్తీక్ వారణాసి, బంటి, కిషోర్, ధర్మేంద్ర, భాను,  తదితరులు సహకారం అందించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....