భాజపా కరోనా వారియర్స్ టీమ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి

భాజపా కరోనా వారియర్స్ టీమ్  ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి

హైదరాబాద్ మే 17 ( ఇయ్యాల తెలంగాణ )

గత 51 రోజులు గా “ఫీడ్ ది నీడి” కార్యక్రమం ద్వారా వలస కార్మికులు, దినసరి వేతన కూలీలు తదితరులకు ఆహారాన్నందిస్తున్న భాజపా హైదరాబాద్ కరోనా వారియర్స్ టీమ్ సనత్ నగర్ ఆదివారం, 17.05.2020 న శ్రీ హనుమాన్ జయంతి ని  ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని తమ సభ్యుడు లక్ష్మణ్ పటేల్ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారని భాజపా నాయకులు యేచన్ సురేష్, పి సునీల్ కుమార్ మరియు పొలిమేర సంతోష్ కుమార్ లు తెలిపారు. పూజానంతరం అన్నప్రసాద వితరణ  చేయడం జరిగిందని తెలిపారు.

ప్రతి సంవత్సరం లక్ష్మణ్ పటేల్ వారి కుటుంబ సభ్యులు మరియు మిత్ర బృందం తో కలిసి అత్యంత కోలాహలంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా  నిరాడంబరంగా నిర్వహించారని సభ్యులు అన్నారు. 

సునీల్ కుమార్ మాట్లాడుతూ హైందవ సాంప్రదాయం ప్రకారం  ఊరి పొలిమేరలోని ఆంజనేయ స్వామి విగ్రహం ఎలాంటి దుష్టశక్తులు గ్రామంలోనికి రాకుండా చేసి గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతాడని నమ్ముతారని అన్నారు. ప్రస్తుత “కరోనా వైరస్” నేపథ్యంలో విశ్వమానవాళినంతటిని కూడా ఆ హనుమంతుడు కాపాడి ఆయురారోగ్యైశ్వర్యాలు ప్రసాదించాలని వేడుకున్నామన్నారు.

ఈ కార్యక్రమానికి  భాజపా యువమోర్చా నాయకులు పి సునీల్ కుమార్ దళిత మోర్చా నాయకుడు పొలిమేర సంతోష్ కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తాళ్ళ జైహింద్ గౌడ్, బాలాజీ మిఠాయి భండార్ లఖన్, దశరథ్ గౌడ్, ఎన్ శివప్రసాద్,  శశాంక్ ఆర్య, సాయి రాథోడ్ (బాపూ నగర్), రాజు, విట్టల్ మురళి, లక్ష్మణ్ పటేల్, బోలేనాథ్, శంకర్, విజయ్, కాసాని శివప్రసాద్ గౌడ్, సరిత శ్రీనివాస్ గౌడ్, అరుణ్ గౌడ్, గోలి వెంకటపతి, మిథుల్ రాజ్, ఫణిమాల, దీపక్, కార్తీక్ వారణాసి, కిషోర్, ధర్మేంద్ర, భాను, సన్నీ రాజ్,  లలన్ భాయి, భరత్, విజయ్ బిడ్లన్, జె కె ఠాకూర్, ఢోలక్ సత్యనారాయణ కుమారుడు రాజు తదితరులు సహకారం అందించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....