హైదరాబాద్, డిసెంబర్ 26 (ఇయ్యాల తెలంగాణ) : చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని ఆదివారం పంజాబ్ హరియాణ హై కోర్టు జస్టిస్ రాజబీర్ శేరావత్ అమ్మవారిని దర్శించుకున్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీసులు పొందడంతో పాటు అమ్మవారి దర్శన భాగ్యం కలుగడం సంతోషదాయకమన్నారు. ఈ సందర్బంగా ఆలయ గౌరవ మర్యాదలతో ఆలయ ట్రస్టీ శశికళ ఆలయ సంప్రదాయాల కనుగుణంగా జస్టిస్ రాజ్ బీర్ శేరావత్ కు ఘన సన్మానం చేశారు. అమ్మవారి దర్శన అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు ఆయనకు అందజేశారు. ఆయన వెంట ఆయన సతీమణి కూడా చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు.
- Homepage
- General News
- భాగ్యలక్ష్మీ ఆలయంలో పంజాబ్ హరియాణ జస్టిస్ ప్రత్యేక పూజలు
భాగ్యలక్ష్మీ ఆలయంలో పంజాబ్ హరియాణ జస్టిస్ ప్రత్యేక పూజలు
Leave a Comment