భాగ్యలక్ష్మీ ఆలయంలో ఆషాడ మాసం ప్రత్యేక పూజలు

 చార్మినార్, జూలై 14 (ఇయ్యాల తెలంగాణ) : ఆషాడ మాసం శుక్రవారం కావడంతో ఈ రోజు పాతనగరంలోని అనేక ఆలయాల వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు కొనసాగాయి. భక్తులు అధిక సంఖ్యలో ఆలయాల వద్ద పూజ కార్యక్రమాలు నిర్వహించారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు కొనసాగించారు. అమ్మవారి ప్రత్యేక హారతి కార్యక్రమాలు కొనసాగాయి. దేవాలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఆలయ ట్రస్టీ శశికళ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఆషాడ మాసం కావడంతో బోనాల సమర్పణకు ప్రత్యేక పూజ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే భక్తుల రద్దీ కొనసాగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల దగ్గర భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....