భాగ్యనగరంలో Heavy Rain ⛈⛈⛈

హైదరాబాద్‌, మే 16 (ఇయ్యాల తెలంగాణ) : భాగ్యనగరంలో ఒక్కసారిగా వాతావరణ మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కారు మబ్బులు కమ్మి ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. కర్మన్‌ ఘాట్‌, చంపాపేట్‌, ఎల్బీనగర్‌, నాగోల్‌ లో వర్షం కురుస్తోంది. అటు దిల్‌ సుఖ్‌ నగర్‌, చైతన్యపురి,సైదాబాద్‌, సంతోష్‌ నగర్‌, మలక్‌ పేట్‌ పరిసర ప్రాంతాల్లోనూ వాన పడుతోంది. అలాగే, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌, మణికొండ, షేక్‌ పేట్‌, గచ్చిబౌలి,  కూకట్పల్లి, నిజాంపేట్‌, హైదర్‌ నగర్‌, కుత్బుల్లాపూర్‌, చింతల్‌, షాపూర్‌ నగర్‌, గాజులరామారాం, సూరారం, బాచుపల్లి నిజాంపేట తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ హెచ్చరించింది.నగరంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోన్న నేపథ్యంలో క్రికెట్‌ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గురువారం నాటి ఉప్పల్‌ మ్యాచ్‌ కు వాన గండం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది.  ఉప్పల్‌ లోనూ మబ్బులు కమ్మేయడంతో మ్యాచ్‌ కు వరుణుడు ఆటంకం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా, గురువారం రాత్రి 7 గంటలకు ఉప్పల్‌  స్టేడియంలో గుజరాత్‌ టైటాన్స్‌, హైదరాబాద్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. అయితే, మ్యాచ్‌ రద్దైనా హైదరాబాద్‌ కు పెద్ద నష్టం ఏవిూ ఉండదు. కాగా, గుజరాత్‌ టైటాన్స్‌ ఇప్పటికే ఎలిమినేట్‌ అయ్యింది. కాగా, ఉప్పల్‌ లో మ్యాచ్‌ ప్రత్యక్షంగా వీక్షించేందుకు టికెట్‌ బుక్‌ చేసుకున్న అభిమానులు నిరాశ చెందుతున్నారు

భారీ వర్ష సూచన

నిన్న పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఆవర్తనం ఈరోజు తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి. విూ. ఎత్తులో కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు ప్రధానంగా దక్షిణ మరియు ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు అక్కడ అక్కడ, రేపు కొన్ని చోట్ల మరియు ఎల్లుండి  అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.  ఎల్లుండి  రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 ` 40 కి. విూ., రేపు  ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 ` 50 కి. విూ., వేగంతో  వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు  వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.మే 16న ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గాలి వేగం గంటకు 40 నుంచి 50 కి.విూ.) కూడిన వర్షాలు తెలంగాణలో కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌ నగర్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. 

సాయంత్రం లేదా రాత్రి సమయంలో గాలులు (30`40 కి.విూ.) తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు, 26 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల ఈదురు గాలులు ఆగ్నేయ దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 6 ` 10 కిలో విూటర్ల నుంచి వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 37.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.4 డిగ్రీలుగా నమోదైంది. 60 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న కేరళ నుంచి మరఠ్వాడా వరకూ ఉన్న ద్రోణి ఇప్పుడు దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తూర్పు విదర్భ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో విూటర్ల ఎత్తులో విస్తరించి ఉంది.నైరుతి రుతుపవనాలు మే 19 నాటికి దక్షిణ అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళా ఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్‌ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో దక్షిణ లేదా నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.ఉత్తర కోస్తాలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలో విూటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలో విూటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలో విూటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....