భవర్ లాల్ వర్మ వర్థంతిలో పాల్గొన్న BJP ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డా లక్ష్మణ్

సనత్ నగర్, మార్చి 22 (ఇయ్యాల తెలంగాణ) :దివంగత BJP తెలంగాణ రాష్ట్ర సంయుక్త కోశాధికారి భవర్ లాల్ వర్మ  ప్రథమ సంవత్సరీకం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన వర్థంతి కార్యక్రమానికి పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా కె లక్ష్మణ్, మాజీ నగర అధ్యక్షులు వెంకట రమణి, వెంకట్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఆకుల విజయ సహా పెద్ద సంఖ్యలో రాష్ట్ర, నగర నాయకులు పాల్గొని భవర్ లాల్ వర్మ చిత్ర పటానికి నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దివంగత వర్మ పార్టీ శ్రేయస్సు కోసం అహర్నిశలు పాటు పడేవారని, స్థాయీ బేధం లేకుండా కార్యకర్తలతో ఇట్టే కలిసిపోయేవాడని, పార్టీ ప్రతి కార్యక్రమంలో క్రియాశీలకంగా పాల్గొంటూ  కార్యకర్తలలో ఉత్సాహం నింపే వాడని గుర్తు చేసుకున్నారు. 

వర్మ అకాల మృత్యువు వారి కుటుంబానికే కాక పార్టీకి కూడా తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత  భవర్ లాల్ వర్మ వర్థంతి కార్యక్రమంలో రవి ప్రసాద్ గౌడ్, యేచన్ సురేష్, తాళ్ల జైహింద్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రాజ్ పురోహిత్,పొలిమేర సంతోష్ కుమార్ కనక సేన, సందీప్ వర్మ, దశరథ్ గౌడ్, వై శ్రీనివాస్ రావు. జి వి శ్రీనివాస్, లక్ష్మణ్, ఆకూరి నాగేశ్వర రావు, జే ప్రవీణ్ గౌడ్, ఐల శ్రీనివాస్, సరిత, మాధవి, మూల రవీందర్, చంద్ర కుమార్, బీరం బాబన్న, రాధాకృష్ణ, శివ కుమార్, రామకృష్ణ, శివ కుమార్, మన్మోహన్ సింగ్ ఠాకూర్, ప్రభాకర్ సింగ్, ఆకుల ప్రతాప్, అడ్వొకేట్ ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....